హెచ్‌సీఎల్‌ సంస్థలో 22వేల ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

ఈ మధ్య కాలంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌సీఎల్‌ సంస్థ కూడా భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించడం గమనార్హం. ఏకంగా 22,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్‌ సిద్ధంగా ఉండటం గమనార్హం. హెచ్‌సీఎల్‌ టెక్‌ ముఖ్య మానవ వనరుల అధికారి సీహెచ్‌ అప్పారావు ఈ విషయాలను వెల్లడించారు. హెచ్‌సీఎల్‌ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన […]

Written By: Navya, Updated On : July 20, 2021 8:17 pm
Follow us on

ఈ మధ్య కాలంలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌సీఎల్‌ సంస్థ కూడా భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించడం గమనార్హం. ఏకంగా 22,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి హెచ్‌సీఎల్‌ సిద్ధంగా ఉండటం గమనార్హం. హెచ్‌సీఎల్‌ టెక్‌ ముఖ్య మానవ వనరుల అధికారి సీహెచ్‌ అప్పారావు ఈ విషయాలను వెల్లడించారు.

హెచ్‌సీఎల్‌ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. సెప్టెంబర్ లో హెచ్‌సీఎల్‌ 6,000 మంది ఉద్యోగులను నియమించుకోనుందని తెలుస్తోంది. 2021 జూన్‌ త్రైమాసికం నాటికి హెచ్‌సీఎల్‌ లో 1,76,499 మంది ఉద్యోగులు పని చేస్తుండటం గమనార్హం. వరుసగా ప్రముఖ కంపెనీలు భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నాయి.

సాఫ్ట్ వేర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఈ అవకాశం సదవకాశమని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీగా అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు కంపెనీలు అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. డిజిటల్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.

పలు ప్రముఖ కంపెనీలు త్వరలో ఆఫీస్ లను ఓపెన్ చేయనున్నాయని తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులు కంపెనీలకు హాజరు కావాలని కంపెనీలు ఉద్యోగులకు సూచనలు చేస్తుండటం గమనార్హం.