https://oktelugu.com/

LIC: ఎల్‌ఐసీ పంట పండింది.. రికార్డుస్థాయిలో ప్రీమియం..!

ఎల్‌ఐసీ పదేళ్లలో వసూలు చేసిన గరిష్ట ఇదే గరిష్ట ప్రీమియం వసూలని పేర్కొంది. ‍ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ 2024, ఏప్రిల్‌ నెలలో రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసినట్లు తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 12, 2024 / 08:15 AM IST

    LIC

    Follow us on

    LIC: బీమా ప్రీమియం వసూలులో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ రికార్డు ​‍సృష్టించింది. ఒక్క నెలలోనే రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. 2014 తర్వాత నెలవారీ అధిక ప్రిమియం వసూలు అయినట్లు తెలిపింది.

    పదేళ్ల తర్వాత గరిష్ట ప్రీమియం..
    ఎల్‌ఐసీ పదేళ్లలో వసూలు చేసిన గరిష్ట ఇదే గరిష్ట ప్రీమియం వసూలని పేర్కొంది.
    ‍ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ 2024, ఏప్రిల్‌ నెలలో రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసినట్లు తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో వసూలైన ప్రీమియం రూ.5,810.10 కోట్లు. ఈ ఏడాది గతేడాదికన్నా 113.14 శాతం అధికంగా వసూలు చసింది.

    – వ్యక్తిగత ప్రీమియం విభాగంలో రూ.3,175.47 కోట్లు వసూలు చేసినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. 2023 ఇదే కాలంలోని వ్యక్తిగత బీమా ప్రీమియం రూ.2,537.02 కోట్లు. ఈ ఏడాది 25.17 శాతం ఎక్కువగా వసూలు చేసినట్లు వెల్లడించింది.

    – ఇక గ్రూప్ పాలసీల ప్రీమియం వసూళ్లు ఈ ఏప్రిల్‌లో రూ.9,141.34 కోట్లుగా ఉన్నాయి. గత ఏప్రిల్‌లో ఇది కేవలం రూ.3,239.72 కోట్లు మాత్రమే. ఈ ఏడాది 182.16% అధికంగా వసూలు చేసింది. పాలసీదారుల నమ్మకంతోనే ఇలా పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలైనట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.