Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయనకు మద్దతుగా కొంతమంది సినీ సెలబ్రిటీలు నిలిచినప్పటికీ మిగతా హీరోల నుంచి మాత్రం ఎలాంటి స్పందన అయితే రావడం లేదు.
నిజానికి హీరోలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతివ్వడానికి రెడీ గా ఉన్నారు. కానీ ఒకవేళ మళ్లీ వైసీపీ ప్రభుత్వం కనక అధికారంలోకి వచ్చినట్లైతే వాళ్ల సినిమాలను తొక్కేసే ప్రయత్నం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడానికి హీరోలందరూ రెడీ గానే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం పైన ప్రతి ఒక్క హీరోకి చాలా కోపం అయితే ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసింది ఏమీ లేదు. ఇక అది పోను టికెట్ల రేట్లు తగ్గించి చాలా సినిమాలను ఇబ్బంది పెట్టిన సంఘటనలు మనం చాలా చూశాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీని తొక్కేయాలని చూసిన అతనికి సినిమా హీరోలు ఎలా మద్దతిస్తారు. వీళ్ళ సపోర్టు మొత్తం పవన్ కళ్యాణ్ కే ఉంటుంది.
ఇక బ్యాకెండ్ నుంచి అందరు హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కి భారీ సపోర్ట్ ను అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈసారి కనక జగన్ ప్రభుత్వం వచ్చినట్లైతే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి భారీగా లాస్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందువల్లే అతని ప్రభుత్వం దిగిపోయి టిడిపి, జనసేన, బిజెపిల కూటమితో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్లు కూడా అనుకుంటున్నారు. అయితే ఓపెన్ గా మద్దతు ఇచ్చే ధైర్యం లేనప్పటికీ మన హీరోలందరూ బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి తోడుగా సినిమా ఇండస్ట్రీ జోలికి వచ్చిన ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు అనేది మాత్రం వాస్తవం…
ఇక సినిమా టికెట్ల రేటు తగ్గించిన సమయంలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలు జగన్ తో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ కార్లను గేటు బయటే ఆపి అక్కడి నుంచి నడిపించుకుంటూ వాళ్లని లోపలికి రప్పించాడు. ఇక అలాగే చిరంజీవి గారిని పెద్దాయన అని కూడా చూడకుండా ఆయనను ఇన్సల్ట్ చేశాడు. అందుకే జగన్ మీద ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది…