Laptop Slow : మీ ల్యాప్ టాప్ స్లోగా మారిందా?.. వెంటనే ఇవి తీసేయండి..

అయితే సిస్టమ్ స్లో కాగానే చాలా మంది ఏదో ప్రాబ్లమ్ ఉందని టెక్నీషియన్ వద్దకు తీసుకెళ్తుంటారు. కానీ ఎటువంటి సమస్య లేకున్నా ఒక్కోసారి డివైజ్ స్లో అవుతుంది.

Written By: Srinivas, Updated On : February 2, 2024 4:27 pm

laptop Fast Run Tricks

Follow us on

Laptop Slow : మనుషులు చేయలేని కొన్ని పనులు కంప్యూటర్లు చేస్తాయి. అలాగేకొన్ని పనులు ఫాస్ట్ గా చేస్తాయి. అయితే ఒక్కోసారి కొన్ని సిస్టమ్స్, ల్యాప్ టాప్స్ టార్టాయిస్ కంటే స్లోగా రన్ అవుతాయి. ఇలాంటి సమయంలో ఇరిటేట్ వస్తుంది. రోజూ ఇదే పరిస్థితి ఉంటే గుండె సమస్యలు కూడా వస్తాయి. అయితే సిస్టమ్ స్లో కాగానే చాలా మంది ఏదో ప్రాబ్లమ్ ఉందని టెక్నీషియన్ వద్దకు తీసుకెళ్తుంటారు. కానీ ఎటువంటి సమస్య లేకున్నా ఒక్కోసారి డివైజ్ స్లో అవుతుంది. ఇలా స్లో అయినప్పుడు వెంటనే టెక్నీషియన్ వద్దకు వెళ్లకుండా ఉన్నచోటే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదేలాగంటే?

కంప్యూటర్, ల్యాప్ టాప్ స్లో అయినప్పుడు వెంటనే రిస్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి కొన్ని సాఫ్ట్ వేర్లలో సమస్యలు వస్తాయి. ఇందుకోసం ముందుగనే సిస్టమ్ స్లో కాకుండా చిన్న ట్రిక్ చేయాలి. ముందుగా కీబోర్డు పైన ఉండే విండోస్ (Windows)ని ప్రెష్ చేసి ఆ తరువాత R లెటర్ ను టైప్ చేయాలి. ఇప్పుడు రన్ అనే బాక్స్ డిస్ ప్లే అవుతుంది. ఇందులో %temp% అని టైప్ చేయాలి. ఇప్పుడు ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న టెంపో ఫైల్స్ ను క్లీన్ చేయాలి.

అయినా కూడా స్లోగానే మూవ్ అవుతుందని అనుకుంటే డివైజ్ లో ఉండే యాంటీ వైరస్ ను ఆప్ చేయాలి. ల్యాప్ డాప్ లో డిఫాల్టర్ గా యాంటీ వైరస్ ఉంటుంది. ప్రత్యేకంగా వేరే యాంటీ వైరస్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాంటీ వైరస్ ఇన్ స్టాల్ చేయడం వల్ల సిస్టమ్ డెడ్ స్లోగా మారుతుంది. అందువల్ల దీనిని తీసేసి చెక్ చేయండి. తప్పకుండా సిస్టమ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది.

అయినప్పటికీ అలాగే ఉంటుందా? అయితే ఈసారి Task Manager అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఇక్కడ Startup యాప్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. ఇవన్నీ బ్యాగ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ వాటిని ఆప్ చేసుకోవాలి. ఇలా ఆప్ చేయడం వల్ల కొంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. విండోస్ ఐకాన్ పై క్లిక్ చేసి స్టోరేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక స్టోరేజ్ సెన్స్ ను ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టెంపరరీ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది.