https://oktelugu.com/

Lalitha Jewellery: లలితా జువెల్లరీ.. ట్యాక్స్‌లో తప్పుడు లెక్కలు నిజమేనా.. అసలేం జరుగుతోంది?

లలతా జువెల్లరి.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా ఫేమస్‌ అయిన ఆభరణాల షోరూం. ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్న కల్యాణ్, ఖజానా, బీఎస్‌కే, తదితర షోరూంలకు గట్టి పోటీ ఇస్తోంది. పక్క ఫోరూంలో పోల్చుకున్న తర్వాతే నగలు కొనండి అని యజమాని చేసే ప్రకటనే లలిత జువెల్లరీకి బలం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 6, 2024 / 05:40 PM IST

    Lalitha Jewellery

    Follow us on

    Lalitha Jewellery: లిలతా జువెల్లరీ.. తెలుగు రాష్ట్రాల్లో బంగారు, వెండి, వజ్రాభరణాల విక్రయాల్లో వేగంగా ఎదుగుతోంది. కేవలం ఐదేళ్ల కాలంలోనే 30కిపైగా షోరూంలు ఏర్పాటు చేసింది. ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖ షోరూంలకు గట్టి పోటీ ఇస్తోంది. మిగతా షోరూంలు తమ వ్యాపారం గురించి సినిమా హీరోలు, హీరోయిన్లతో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటే.. లలితా మాత్రం ఆ సంస్థ యజమానితోనే ప్రకటనలు ఇస్తూ భారీగా ఆదాయం వెనకేసుకుంటోంది. డబ్బులు ఊరకే రావు.. ఏ ఆభరణమైన వేరే షోరూంలో చూసిన తర్వాతే కొనండి వంటి ప్రకటనలు కస్టమర్లను ఆలోచింపజేస్తాయి. దీంతో వేగంగా విస్తరిస్తోంది. ధరలు కూడా ఇతర షోరూంలతో పోలిస్తే తక్కువగా ఉంటున్నాయి. ఇతర షోరూంల తరహాలో ఇక్కడ స్కీంలు ఉండవు. నేరుగా కొనుగోలుపైనే డిస్కౌంట్‌ ఇస్తున్నారు. ఇది కూడా లలిత జువెల్లరి సక్సెస్‌ సీక్రెటల్‌లలో ఒకటి. ఇలా కస్టమర్లను ఆకట్టుకుంటున్న లలిత జువ్లెరీపై ఇప్పుడు ఒక వార్త సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌ వార్త సంస్థల్లో చెక్కర్లు కొడుతోంది. ఇది మెయిన్‌ టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో రావడం లేదు. ఎందుకంటే లలిత జువెల్లరీ యజమాని వాటికి భారీగా ప్రకటనలు ఇస్తారు. దీంతో అవి ఈ వార్తను ప్రచురితం చేయడం లేదని తెలుస్తోంది. డబ్బులు ఊరకే రావు అంటూ ప్రచారం చేసే లలిత జువెల్లరీ యజమానే ప్రభుత్వాన్ని ట్యాక్స్‌ విషయంలో మోసం చేశారు అనేది ఈ వార్త సారాంశం. నాలుగు రోజులుగా ఈ వార్త చెక్కర్లు కొడుతోంది. దీనిపై లలిత జువెల్లరీ యాజమాన్యం మాత్రం ఇంకా స్పందించలేదు.

    ఏం జరిగిందంటే..
    ’’డబ్బులు ఎవరికి ఊరికే రావు’’ అంటూ ఈ ఒక్క డైలాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌ పాపులర్‌ అయ్యారు లలితా జువెల్లరీ అధినేత కిరణ్‌ కుమార్‌. ఈ ఒక్క మాటతో బంగారం కొనుగోలు చేసే వారిని తన వైపు తిప్పుకునేలా చేశారు. మిగిలిన బంగారపు షాపులతో పోలిస్తే లలితా జువెల్లరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే బంగారం కోనండి అంటూ బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్నారాయన. లలితా జువెల్లరీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం కలిగించారు. అయితే అలాంటి కిరణ్‌ కుమార్‌ జీఎస్టీ విషయంలో అడ్డంగా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్‌ కుమార్‌ జీఎస్టీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పేరుతో ప్రభుత్వాన్ని బురిడి కొట్టించాలని చూసినట్లు ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు చూపించి అధికారులకు దొరికిపోయారట. హైదరాబాద్‌ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017–18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్‌ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పింటిన రిటర్న్స్‌ లెక్కల ప్రకారం రూ. 41.22 కోట్లే రావాల్సి ఉంది.

    వాస్తవానికంటే ఎక్కువ పొందినట్లు..
    వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు లెక్కల్లో తేలింది. ఇయర్‌ ఎండింగ్‌ లెక్కల్లో లలితా జువెల్లరీ అధినేత చేసిన స్కాం బయటపడటంతో స్టేట్‌ కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. లలిత జువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్‌ వివరాలను ఇవ్వాల్సిందిగా కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) సైతం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్టేట్‌ కమర్షియల్‌ టాక్స్‌ డిపార్టుమెంట్‌.. వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేల్చారు. దీనిపై జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదనంగా పొందిన రూ. 15.39 కోట్లలో రూ. 14.85 కోట్ల మేర తిరిగి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు.

    మిగిలినవి ఎప్పుడో?
    అయితే మిగిలిపోయిన రూ. 53.52 లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్‌ పేర్కొంది. డబ్బులు ఊరికే రావు… అంటూ ప్రజలకు సూక్తులు చెప్పే లలిత జువెల్లరీ అధినేత, తాను మాత్రం తప్పుడు లెక్కలు చూపించి ఏకంగా రూ. 15.39 కోట్లను పొందడం ఇప్పుడు సంచలనంగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై లలిత జువెల్లరీ అధినేత కిరణ్‌కుమార్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. రోజూ టీవీల్లో మాత్రం ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.