https://oktelugu.com/

CM Revanth Reddy: బిగ్ సర్‌ప్రైజ్.. న్యూయార్క్‌ టైం స్క్వైర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో.. ఎవ్వరూ ఊహించని గౌరవం!

తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం అమెరికా వెళ్లారు. తన వెంట మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారితోపాటు పలువురు అధికారులను తీసుకెళ్లారు. పది రోజులపాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో అమెరికా వెళ్లిన రేవంత్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తాజాగా న్యూయార్క్‌లో అభిమానులు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 6, 2024 5:34 pm
    CM Revanth Reddy

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు హామీలను అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తాజాగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు ఇటీవలే 2024-25 సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2న ముగిశాయి. ఈ క్రమంలో తెలంగాణలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. అగ్రరాజ్యంలో సీఎంకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తెలంగాణ ప్రాంత ఎన్సారైలు, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు స్వాగతం పలికారు. నాలుగు రోజులు వాషింగ్‌టన్‌లో పర్యటించిన సీఎం అక్కడ ఎన్నారైలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ క్రమంలో కాగ్నిజెంట్‌ సంస్థ హైదరాబాద్‌లో పెటు‍్టబడులకు ముందుకు వచ్చింది. ఈమేరకు ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. దీంతో మంగళవారం(ఆగస్టు 6న) ఆయన న్యూయార్క్‌కు వెళ్లారు.

    బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అభిమానులు..
    న్యూయార్క్‌లో అడుగు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌పై ఆయన ఫొటోలను ప్రదర్శించారు. వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను టైమ్‌ స్కే‍్వర్‌పై ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టైమ్ స్క్వేర్ సందర్శించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అలాంటి చోట రేవంత్ ఫోటోలు బిగ్ స్కీన్‌పై ప్రదర్శించటం అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఇక అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌ను తలపించేలా హైదరాబాద్ నగరంలోనూ టీ స్క్వేర్ నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మల్టీపర్పస్ హబ్ దీన్ని నిర్మించాలని డిసైడ్ అయింది. రాయదుర్గంలో డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టెండర్లను సైతం టీజీఐఐసీ ఆహ్వానించింది. దీని నిర్మాణంతో హైదరాబాద్ సిగలో మరో ఐకానికి ల్యాండ్ మార్క్‌ను సెట్ చేయాలని సర్కార్ యోచిస్తోంది.

    అమెరికాలో బిజీ బిజీగా..
    ఇదిలా ఉంటే.. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడల సాధనే లక్ష్యంగా ఈనెల 3న ఆయన యూఎస్ పర్యటనకు వెళ్లగా.. అక్కడ ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడుల గురించి ఫలప్రదమైన చర్చలు జరుపుతున్నారు. వి-హబ్ ప్రతినిధులు డబ్ల్యూకే హోల్డింగ్‌తో తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. 5 మిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. వి-హబ్ అనేది రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. మహిళా పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన తొలిరోజే ఎయిర్‌పోర్టులో అపూర్వ సాగ్వతం లభించింది. న్యూయార్క్ సిటీలో ఇటీవల రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ మద్దతుదారులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. అమెరికా పర్యటన తర్వాత ఆయన దక్షిణ కొరియాలోనూ పర్యటిస్తారు. ఈనెల 14 తిరిగి రాష్ట్రానికి వస్తారు.