శాలరీ రావడం ఆలస్యమవుతోందా.. లక్ష రూపాయలు పొందే అవకాశం..ప్

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన కోటక్ మహీంద్ర బ్యాంక్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ‘పే డే లోన్’ పేరుతో కోటక్ మహీంద్ర బ్యాంక్ రుణాలను ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ రుణం పొందాలని అనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అత్యవసర ఖర్చులు వచ్చినా, అనుకోని సమస్యలు ఎదురైనా డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు అవసరం అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ […]

Written By: Navya, Updated On : August 3, 2021 9:05 pm
Follow us on

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన కోటక్ మహీంద్ర బ్యాంక్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ‘పే డే లోన్’ పేరుతో కోటక్ మహీంద్ర బ్యాంక్ రుణాలను ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ రుణం పొందాలని అనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అత్యవసర ఖర్చులు వచ్చినా, అనుకోని సమస్యలు ఎదురైనా డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

అకస్మాత్తుగా డబ్బు అవసరం అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ లేదా ఎర్లీ శాలరీ లోన్ ను పొందవచ్చు. కొన్ని దశలను అనుసరించడం ద్వారా రుణం సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 3,000 రూపాయల నుంచి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు రుణం తీసుకునే ఛాన్స్ ఉండగా రుణ మొత్తం వడ్డీ, ఏదైనా ఫీజులు లేదా ఛార్జీలు ఉంటే కస్టమర్ ఛార్జీల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ రుణంపై 10 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఒకే విడతలో లోన్ చెల్లించే అవకాశం ఉండగా రుణం తిరిగి చెల్లించడానికి చివరి తేదీని లోన్ వివరాల్లో పేర్కొంటారు. రుణం కొరకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి మన దేశానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలి. ఆ వ్యక్తి వయస్సు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

కనీస జీతం మొత్తం నెలకు 10,000 రూపాయలుగా ఉండాలి. లోన్ ప్రాసెసింగ్ ఫీజు 235 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. రాష్ట్ర సంబంధిత స్టాంప్ యాక్ట్ ప్రకారం లోన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు స్టాంపింగ్ డ్యూటీలను చెల్లించాల్సి ఉంటుంది.