కరోనా అలా కూడా సోకుతుందట.. షాకింగ్ విషయం చెప్పిన వైద్యులు?

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా అప్రమత్తంగా లేకపోతే వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో కరోనా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్ల వల్ల కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. శరీరంలో ఏదో ఒక […]

Written By: Navya, Updated On : August 3, 2021 8:39 pm
Follow us on

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా అప్రమత్తంగా లేకపోతే వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో కరోనా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమృత్‌సర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహించిన పరిశోధనలో కన్నీళ్ల వల్ల కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది.

శరీరంలో ఏదో ఒక వ్యాధి కారణంగా కంటిని ప్రభావితం చేసే లక్షణం ఉంటే కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతుండటం గమనార్హం. 120 మంది కరోనా రోగులపై అధ్యయనం చేసి వైద్యులు ఈ విషయాలను వెల్లడించారు. 60 మంది రోగులలో కన్నీళ్ల ద్వారా వైరస్ శరీరంలోని మరొక భాగానికి చేరిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మిగిలిన వారిలో మాత్రం ఆ విధంగా జరగలేదు.

ఈ పరిశోధనకు ఎంచుకున్న రోగుల్లో కొంతమంది కంటికి సంబంధించిన ఇతర సమస్యలతో బాధ పడుతుండటం గమనార్హం. కంటి వ్యక్తీకరణ ఉన్న రోగులలో 37 శాతం మందిలో కరోనా వైరస్ పాక్షిక లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైద్యులు సైతం రోగుల కళ్ళు, ముక్కు, నోటిని పరీక్షించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.

కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు వైరస్ గురించి పరిశోధనలు చేస్తూ కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ గురించి ప్రయోగాలు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.