Homeబిజినెస్Today Gold Silver Prices: షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Today Gold Silver Prices: షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Today Gold Silver Prices: బంగారం ధరలు రోజుకో రకంగా పెరుగుతూ తగ్గుతున్నాయి. సాధారణంగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి. బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. దీంతో ఓవైపు పెట్టుబడిదారులను మరోవైపు కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు అనిపించింది. పారిశ్రామిక వినియోగంలో తగ్గుదల, డాలర్ బలపడడం వంటి కారణాలు వెండి ధర తగ్గిందని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం అంతర్జాతీయంగా మార్కెట్లో వెండి ధరల్లో ఒత్తిడి కొనసాగుతుండగా ధరలు పడిపోయినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,780 కి చేరింది. సోమవారం కంటే మంగళవారం రూ.430 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 కి చేరింది. బంగారం విషయంలో అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉండడం వల్లే స్వల్పంగా ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. నిన్నటి కంటే ఈరోజు రూ.10,000 పడిపోవడంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,90,000 పలుకుతోంది. మార్కెట్ డిబులు తెలుపుతున్న ప్రకారం వెండి ధరలు ఎక్కువగా పారిశ్రామిక డిమాండ్ పై ఆధారపడుతూ ఉంటుంది. అయితే గ్లోబల్ ఆర్థిక అనిచ్చితి కారణంగా బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం మార్పుకు లోనవుతున్నాయి.

ఇదిలా ఉండగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాల కారణంగా బంగారం ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాగే వెండి పాత్రలో కొనుగోలు కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో సామాన్యులు వీటి ధరలపై ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఏ రోజు పెరుగుతుందో..? ఏ రోజు ధర తగ్గుతుందో? తెలియని పరిస్థితి ఉంది. అయితే అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులే బంగారం, వెండి ధరల మార్పుకు చోటుచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అత్యవసరం ఉన్నవారు బంగారం కొనుగోలు చేసుకుని స్టోర్ చేసుకోవడమే మంచిదని అంటున్నారు. ఎందుకంటే బంగారం ధర పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఇంటి ధరలు తగ్గినా తగ్గొచ్చని చెబుతున్నారు.

అయితే పెట్టుబడులు పెట్టేవారు మాత్రం బంగారం వైపు మాత్రమే చూడాలని.. వెండి కొనుగోలు విషయంలో ఆలోచించాలని పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలావరకు వెండి ధర తగ్గింది. ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వెండిని ఆభరణాలుగా కాకుండా పారిశ్రామిక రంగాల్లో ఎక్కువగా వాడుతారు. ఈ పారిశ్రామిక రంగాల్లో చిన్న మార్పు వచ్చినా కూడా వెండి ధర భారీగా పడిపోయే అవకాశం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version