Site icon OkTelugu

Chery iCar V23 Electric SUV: లగ్జరీ కార్లకు తీసిపోని విధంగా డిజైన్.. ఇది ఏ కారో తెలుసా..?

Chery iCar V23 Electric SUV

Chery iCar V23 Electric SUV

Chery iCar V23 Electric SUV: కారు కొనాలని అనుకున్నప్పుడు ఇంజన్, మైలేజ్ మాత్రమే కాకుండా ఇందులో ప్రయాణిస్తే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకునే వారు చాలామంది ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు డిజైన్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే ఇటీవల JSW అనే కంపెనీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ Chery తో కలిసి ప్రత్యేకమైన డిజైన్తో కొత్త కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ కావడంతో నేటి తరం వారికి అనుగుణంగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఒక్కసారిగా దీన్ని చూస్తే వెంటనే కొనాలనిపించే ఉండడంతో దీని గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఇంతకీ ఈ కారు విశేషాలు ఏంటంటే?

సాధారణంగా కారు కొనేటప్పుడు రగ్గడ్ స్టైల్లో ఉండేవాటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మహీంద్రా కంపెనీకి చెందిన థార్ వంటి మోడల్స్ ఇలాగే ఉంటాయి. థార్ పెరగడానికి డిజైన్ కూడా కారణమే అని అంటుంటారు. అయితే ఇప్పుడు అదే స్టైల్ లో JSW గ్రూప్ Chery అనే ఎలక్ట్రిక్ వాహన కంపెనీతో కలిసి కొత్త వాహనాన్ని తీసుకొస్తుంది. దీనికి Chery iCar V23 అనే పేరు పెట్టారు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV గా వస్తున్న ఈ కారు లో ఇంధన సామర్థ్యం, ఎలక్ట్రిక్ మోటార్ కలిపి అద్భుతమైన మైలేజ్ ఇవ్వనుంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి ఈ విటారాకు సమానంగా ఉండే అవకాశం ఉంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో రౌండ్ హెడ్ లాంప్స్, స్టీల్ ఆఫ్ ఫ్రంటు కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సైడ్ ప్రొఫైల్లో వాటర్ గ్లాస్ పాత మహేంద్ర జీపు వలె కనిపిస్తుంది. దీని టైర్లు 19 అంగుళాలు ఉండే అవకాశం ఉంది.

ఈ కారు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ అయింది. దాని ప్రకారం ఇందులో 59.93 kWh, 81.76 kWh బ్యాటరీ ప్యాక్ లో ఉండనున్నాయి. ఈ బ్యాటరీ 134 బిహెచ్పి, టు ఫోర్ ఎయిట్ బిహెచ్పి పవర్ను అందిస్తాయి. ఈ బ్యాటరీలు ఒక్కసారిగా చార్జింగ్ చేస్తే వరుసగా 360, 430 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది ఎక్స్టీరియర్ మాత్రమే కాకుండా ఇన్నర్ లోను ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మినిమలిస్టు స్టైల్లో డాష్ బోర్డు ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 8155 చిప్ తో పని చేస్తుంది. ఇది ఉండడంవల్ల స్మూత్ డ్రైవింగ్ అనుభూతి పొందవచ్చు. అలాగే ఇందులో ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఇన్నర్ లో 744 లీటర్ల బూట్స్ పేస్ తో ప్రయాణికులకు ఎలాంటి అలసట కలగకుండా ఉంటుంది.

Exit mobile version