https://oktelugu.com/

MG Astor : కొత్త ఇంజిన్, అప్డేటెడ్ ఫీచర్స్.. మరింత ఎట్రాక్టివ్‎గా ఎంజీ ఆస్టర్

MG Astor : తాజా వెర్షన్ ఆస్టర్ కొత్త అప్‌డేటెడ్ షైన్ వేరియంట్‌తో విడుదల అయింది. ఇది ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. రూ.12.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఇది ఇప్పుడు తన సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే అత్యంత చౌకైన SUV. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు దీని అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి.

Written By: , Updated On : March 29, 2025 / 04:35 PM IST
MG Astor

MG Astor

Follow us on

MG Astor : ఎంజీ మోటార్ ఇండియాలో అప్‌డేట్ చేసిన ఆస్టర్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఆస్టర్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఆస్టర్ తాజా మోడల్‌లో మోడల్ ఇయర్ 2024 మోడల్‌తో పోలిస్తే చిన్న మార్పులు, కొత్త బ్రాండింగ్ ఉన్నాయి. ఎంజీ తన తాజా ఆస్టర్‌ను బ్లాక్‌బస్టర్ SUVగా పేరు మార్చింది.

Also Read : ఏ కార్లలో లేని కొత్త టాటా ఆల్ట్రోజ్‌లో ఉండే 4 స్పెషాలిటీలు ఇవే !

తాజా వెర్షన్ ఆస్టర్ కొత్త అప్‌డేటెడ్ షైన్ వేరియంట్‌తో విడుదల అయింది. ఇది ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. రూ.12.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఇది ఇప్పుడు తన సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే అత్యంత చౌకైన SUV. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు దీని అన్ని మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి.. ఇది చాలా అవసరమైన సేఫ్టీ ఫీచర్.

కారు ఇంటీరియర్‌లో మార్పులు
దీంతో పాటు ఇప్పుడు ఆస్టర్ అన్ని మోడళ్లలో ఐవరీ ఇంటీరియర్ థీమ్‌ను చూడవచ్చు. టాప్-స్పెక్ సావీ ప్రోలో మాత్రమే సంగ్రియా ట్రిమ్ ఆఫ్షన్ లభిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, ఐ-స్మార్ట్ 2.0 అడ్వాన్స్‌డ్ UI, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ తో వస్తుంది.

ఆస్టర్‌లో లభించే ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే ఎంజీ ఆస్టర్‌లో 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6 స్పీకర్ల ఆడియో సిస్టమ్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, ఆటో డిమ్మింగ్ IRVM, జియో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఆస్టర్‌లో 14 లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఇచ్చారు.

ఇంజిన్‌లో పెద్ద మార్పు
కొత్త ఆస్టర్‌లో అతిపెద్ద మార్పు ఇంజిన్‌లో చూడవచ్చు. ఎంజీ మోటార్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను లైనప్ నుంచి తొలగించింది. ఆస్టర్ ఇప్పుడు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 8-స్పీడ్ CVT ఆటోమేటిక్ యూనిట్‌తో ఉపయోగించవచ్చు. ఈ ఇంజిన్ 109 bhp పవర్, 144 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read : టూ వీలర్ మార్కెట్లో 64శాతాన్ని కబ్జా చేసిన బైక్.. అంతలా ఏముంది దీనిలో ?