Bikes: బైక్ లకు డీజిల్ ఇంజన్లు ఎందుకు ఏర్పాటు చేయరో తెలుసా?

డీజిల్ ఆధారంగా నడిచే ఇంజిన్లను ఆటోమొబైల్ పరిభాషలో గ్యాసోలిన్ ఇంజన్లు అంటారు. ఇవి పెట్రోల్ ఇంజన్ల కంటే పెద్దగా ఉంటాయి. ఎక్కువ భాగాలను కూడా కలిగి ఉంటాయి. వీటికి ఎక్కువ శీతలీకరణ అవసరం.

Written By: Anabothula Bhaskar, Updated On : March 25, 2024 1:30 pm

Why diesel engines are used in motorbikes

Follow us on

Bikes: పెద్దపెద్ద వాహనాలు డీజిల్ ఆధారంగా నడుస్తాయి. కొన్ని కార్లు కూడా డీజిల్ తోనే ముందుకు సాగుతాయి. ద్విచక్ర వాహనాలు మాత్రం పెట్రోల్ వస్తేనే నడుస్తాయి. భారీ వాహనాలకు డీజిల్ ఆధారిత ఇంజన్లు.. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ తో నడిచే ఇంజన్లు ఎందుకు ఏర్పాటు చేస్తారోననే సందేహం మనలో చాలామందికి ఉంటుంది.

డీజిల్ ఆధారంగా నడిచే ఇంజిన్లను ఆటోమొబైల్ పరిభాషలో గ్యాసోలిన్ ఇంజన్లు అంటారు. ఇవి పెట్రోల్ ఇంజన్ల కంటే పెద్దగా ఉంటాయి. ఎక్కువ భాగాలను కూడా కలిగి ఉంటాయి. వీటికి ఎక్కువ శీతలీకరణ అవసరం. డీజిల్ ఆధారంగా పనిచేసే ఇంజన్లు అవి ఎక్కువగా కార్బన్ విడుదల పైగా అధికంగా టార్క్ కలిగి ఉంటాయి. భారీ వాహనాలు వేగం పెరిగేకొద్దీ మరింత బరువుగా తయారవుతాయి. అలాంటప్పుడు ఆ వాహనాన్ని ముందుకు నడపాలంటే ఇంజన్ కు అధికంగా సామర్థ్యం అవసరం. ఆ సామర్థ్యం ఇంజన్ కు సమకూరాలంటే కచ్చితంగా డీజిల్ కావాల్సిందే.

డీజిల్ ఇంజన్లు ఎక్కువ శబ్దాన్ని కలగజేస్తాయి. ఎందుకంటే అవి నడుస్తున్నప్పుడు ఎక్కువ పౌన:పుణ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ శబ్దం పాదచారులకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగజేస్తుంది. ఇటీవల వస్తున్న వాహనాలు మాత్రం గతంలో మాదిరి శబ్దం చేయడం లేదు. డీజిల్ ఇంజన్లు తక్కువ శక్తిని సృష్టిస్తాయి. పైగా ఇంజన్ అధిక సామర్థ్యంతో పని చేయడం వల్ల ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో అంతర్గతంగా శీతలీకరణ జరుగుతుంది కాబట్టి ఇంజన్ ఎంతసేపు పని చేసినా అలసటకు గురికాదు.

ద్విచక్ర వాహనాల ఇంజన్లు ఎక్కువగా శబ్దం చేయవు. ద్విచక్ర వాహనం ఒక నిర్ణీత వేగానికి వెళ్లేసరికి దాని బరువు తగ్గుతుంది. అలాంటప్పుడు ఇంజన్ మీద పెద్దగా ప్రభావం పడదు. అందుకే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ తో పనిచేసే ఇంజన్లు అమర్చుతుంటారు. ఎంత దూరం వెళ్లినప్పటికీ పెట్రోల్ ఆధారిత ఇంజన్ పెద్దగా వేడి కాదు. ఒకవేళ వేడికి గురైతే వాహనం పనితీరు ద్వారా మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు కొంతసేపు ఇంజన్ ఆపి.. మళ్లీ వాహనం స్టార్ట్ చేస్తే పూర్వపు వేగాన్ని అందుకుంటుంది. గతంలో కార్లు డీజిల్ ఆధారంగా నడిచేవి. కానీ ప్రస్తుతం పెట్రోల్ ఇంజన్లలోనూ సామర్థ్యాన్ని పెంచడంతో.. పెట్రోల్ ఆధారంగా పనిచేసే కార్లు ఇతర వాహనాలు రోడ్లమీద చక్కర్లు కొడుతున్నాయి. అయితే పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తవుతున్నాయి. టెస్లా వంటి కంపెనీ ఎలక్ట్రిక్ కారును తయారుచేసింది. మరి కొద్ది రోజుల్లో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లు సందడి చేసే అవకాశం కనిపిస్తోంది.