Kia Sonet: కియా సోనెట్ కొత్త మోడల్ చూశారా? ఫీచర్స్ అదిరిపోయాయి..

కియా సోనెట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 82 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

Written By: Srinivas, Updated On : January 20, 2024 6:46 pm

Kia Sonet

Follow us on

Kia Sonet: కొరియన్ కంపెనీకి చెందిన కియా భారత మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన సోనేట్ ఇప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో రిలీజ్ అయింది. 2024 కొత్త ఏడాది సందర్భంగా పలు కంపెనీలు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో ఎక్కువగా SUVలే ఉండడం విశేషం. ఇందులో భాగంగ కియా కంపెనీకి చెందిన సోనెట్ సబ్-4 మీటర్ ఎస్ యూవీ కొత్త డిజైన్ లో ఆవిష్కృతమైంది. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు మైలేజ్ ను చూసి వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు. ఈ మోడల్ వివరాల్లోకి వెళితే..

కియా సోనెట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 82 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. 1 లీటర్ కూడా ఇంజిన్ 118 బీహెచ్ పీ పవర్, 172 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. కియా సోనెట్ లో 16 ఇంచెస్ స్పోర్టీ క్రిస్టల్ కట్ తో పాటు అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్ రూప్ ఆకర్షిస్తాయి.

ఈ కొత్త మోడల్ లో డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ 10.25 ఇంచెస్ డ్యాష్ బోర్డు ఆకర్షిస్తుంది. 70 ప్లస్ కనెక్ట్ చేసిన ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. సౌండింగ్ కోసం 7 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, వైర్ లెస్ మొబైల్ ఛార్జింగ్, ఇన్ బిల్ట్ ఎయిర్ ఫ్యూరివైయర్ సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ కారు పెట్రోల్ ఇంజిన్ 18.83 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా.. డీజిల్ వేరియంట్ లీటర్ కు 22.3 కిలోమీటర్ల మైలేజ్ ఇష్తుంది.

ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంపులు ఆకర్షిస్తాయి.ఇంటీరియర్ క్యాబిన్ ను అప్డేట్ చేసి కొత్త క్లైమేట్ కంట్రోల్ చేసే విధంగా సెట్ చేశారు. దీనిని 7.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. డిసెంబర్ 14న దీని బుకింగ్ ప్రారంభ కాగా.. ఇప్పటికే చాలా మంది బుకింగ్ చేసుకున్నారు.