Nikhil Siddhartha: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ లుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కొన్న వారే.ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిని భరించి నేడు స్టార్ హీరో హీరోయిన్ ల స్థాయికి ఎదిగారు.అలా టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న ఒక హీరో కెరియర్ మొదట్లో ఫ్లాప్ హీరోగా చతికిల పడ్డాడు.ఇప్పుడు స్టార్ డం తో ఒక్కో మెట్టు ఎక్కి ఎంతో ఎదిగాడు. ఆ హీరోనే నిఖిల్..మొదట హీరో నిఖిల్ నటించిన సంబరం అనే సినిమాలో డ్రైవర్ పాత్రలో నటించిన అతను ఆ తర్వాత ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.
ఇక అందులో ఒక కాలేజీ కుర్రాడి పాత్రలో కనిపించాడు.అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నలుగురు హీరోలలో ఒక హీరోగా నటించాడు నిఖిల్.ఆ సినిమాకు గాను మొదటి రెమ్యూనరేషన్ గా 25 వేలు అందుకున్నాడు.ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మొదట్లోనే ఫ్లాప్ హీరోగా ముద్ర పడింది.ఫ్లాప్ హీరో అని ముద్ర పడినప్పటికీ అవకాశాలు మాత్రం భారీగా వచ్చి చేరాయి.కానీ దురదృష్టవశాత్తు వరుసగా అన్ని డిజాస్టర్లు గానే నిలిచాయి.అలా దాదాపుగా ఆరేళ్లు వరుస ఫ్లాప్ లతో సతమతమైన ఈ యంగ్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా మారాడు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.వరుసగా సినిమాలలో నటించినప్పటికీ అన్ని ఫ్లాప్ గా నిలిచాయి.ఆ తర్వాత 2013లో విడుదలైన స్వామి రారా సినిమాతో మొదటిసారిగా హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం, 18 పేజెస్, కార్తికేయ 2 అలాంటి సినిమాలలో నటించి మెప్పించాడు.
ఈ సినిమాలు అన్నీ కూడా హిట్ సాధించడంతో వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో.ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ఈ సినిమాతో బాలీవుడ్, కోలీవుడ్,మాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా జెండా పాతేశాడు.కార్తికేయ 2 సినిమా నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక భారీ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను సృష్టించింది.ఇలా ఫ్లాప్ హీరో ఫేమస్ హీరోగా మారాడు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ గా ఎతగడం తో అందరి దృష్టి హీరోపై పడింది.కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఊహించని దానికంటే ఎక్కువ కలెక్షన్లు, మంచి టాక్ అందుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అయిత కచ్చితంగా ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు నెటిజన్లు. చివరగా నీ ప్రయాణం కొనసాగుతుంది అన్న నేపథ్యంలో నెటిజన్లు కార్తికేయ 3 కోసం ఎదురుచూస్తున్నారు.
హీరోయిన్ లు మారినా ఇందులో హీరో మారడు అని ఇప్పటికే అర్థం అయింది. దీంతో కార్తికేయ 1 ఎంతటి హిట్ సాధించిందో.. అదే విధంగా కార్తికేయ 2 కూడా బ్లాక్ బస్టర్ అయింది. కథ మార్చి క్యూరియాసిటీ కలిగేలా సీక్వెల్ తీస్తే మరో సారి హిట్ అందుకుంటాడు నిఖిల్ అనడంలో సందేహం లేదు అని అంటున్నారు ఆయన అభిమానులు. మరి చూడాలి ఈ ఫ్లాప్ నుంచి పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ ప్యూచర్ ఎలా ఉండనుందో….