https://oktelugu.com/

Kia Picanto : కియా నుంచి అదిరిపోయే కారు.. ఫీచర్లు, ధర ఇవీ

ఇది సరికొత్త డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో కూడుకొని ఉంది. దీనికి సంబంధించిన డీటేయిల్స్ సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో కార్ల వినియోగదారులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2024 / 04:20 PM IST

    kia picanto

    Follow us on

    Kia Picanto:  కియా కార్లు అంటే కొంత మందికి క్రేజీ. లేటేస్ట్ టెక్నాలజీతో పాటు అప్డేట్ వెర్షన్ తో కూడిన ఈ కంపెనీకి చెందిన కార్లు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కియా సెల్టోస్ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా కియా నుంచి ‘పికాంటో’ రెండో ఫెస్ లిప్ట్ రాబోతుంది. ఇది సరికొత్త డిజైన్ తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో కూడుకొని ఉంది. దీనికి సంబంధించిన డీటేయిల్స్ సోషల్ మీడియాలో రిలీజ్ కావడంతో కార్ల వినియోగదారులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అసలు కియా ‘పికాంటో’ ఎలా ఉంది? దీని ఫీచర్లు ఏ విధంగా ఆకట్టుకుంటున్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..

    ‘కియా’ కంపెనీ నుంచి మూడో జనరేషన్ గా వస్తుంది ‘పికాంటో’. ఇది 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటేడ్ 4 సిలిండర్ పెట్రోల్ తో పాటు 83 బీహెచ్ పీ వపర్, 122 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కార్ ఇన్నర్ లో 4.2 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుుమెంట్ క్లస్టర్, ఆధునిక సింథటిక్ లెదర్, స్టీరింగ్ వీల్, పిష్ట్ నాబ్ కోసం కొత్త ప్రీమియం, వెనుకవైపు యూఎస్బీ టైప్ సీ చార్జర్ పోర్ట్, 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లేను కలిగి ఉంది. కొత్త కియా పికాంటో విశాలమైన స్పేస్ ను కలిగి ఉంది. కొత్త లైట్లు, విభిన్న బంపర్లు ఆకర్షిస్తున్నాయి.

    ఇండియాలో దీని లాంచింగ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ పికాంటో పై తీవ్ర చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇందులో బ్లైండ్ స్పాట్ కొలిజన్ ఎవాయిడెన్స్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్, లేన్ ఫాలో అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ప్రొటెక్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం ఏడు రకాల కలర్లలో లభ్యమవుతున్న పికాంటోలో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను ఆమర్చారు. ఇక ఫ్రంట్ లో ఎల్ ఈడీ బెస్పోక్ హెడ్ లైట్లుల, రివైజ్ చేయబడిన రియర్ ఫేసియా ఉంది.

    మొత్తంగా పికాంట్ స్పోర్ట్స్ డిజైన్ లో ఉండడంతతో కార్ల వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో ఫ్లాష్ పిగ్ జీటి లైన్ తో పాటు కొత్త గ్లోస్ బ్లాక్ డిప్యూజయిర్ ను అమర్చడంతో సరికొత్తగా లుక్ ని ఇస్తోంది. ఫేస్ లిప్ట్ కారు కావాలనుకునేవారు కియా పికాంటోను సెలెక్ట్ చేసుకోవచ్చని కార్ల ప్రతినిధులు చెబుతున్నారు.