Kia Electric Car
Kia : భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో కియా ఇండియా సంచలనం సృష్టించింది. మారుతి, హ్యుందాయ్, టాటా-మహీంద్రా వంటి దిగ్గజాలకు పోటీనిస్తూ సింగిల్ ఛార్జ్‌పై 650 కిమీల రేంజ్‌ను అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఎట్రాక్టివ్ ఫీచర్స్, స్టైలిష్ డిజైన్‌తో పాటు ఈ కారు ధర కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. కియా ఇండియా తమ పాపులర్ ఎలక్ట్రిక్ కారు ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త మోడల్‌లో అప్ డేటెడ్ డిజైన్ అంశాలతో పాటు, కొత్త బ్యాటరీ ప్యాక్, అనేక ఎక్స్ ట్రా ఫీచర్లను కూడా అందించారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర మన దేశంలో రూ. 65.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ కారును ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది.
Also Read : మారుతి ఫ్రాంక్స్ vs టాటా పంచ్.. మైలేజ్ ఎవరిది? సేఫ్టీ ఎవరికి ?
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా ఏముంది?
కియా ఈవీ6 ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కంపెనీ కొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లను అమర్చింది. అలాగే, కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను కూడా అందించారు. ఎక్సటర్నల్ గానే కాకుండా, ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు చేశారు. ఈ కారులో ఇప్పుడు ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ ఫీచర్ లభిస్తుంది. దీనితో పాటు 12-ఇంచుల హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్‌ను కూడా ఇందులో చూడవచ్చు.
కొత్త అప్‌డేట్‌లతో కియా ఈవీ6 ఒకటి కంటే ఎక్కువ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్ నుండి గ్లాస్ బ్లాక్ ప్లాస్టిక్‌ను తొలగించారు. దీని మోటార్‌ను అప్‌డేట్ చేయడంతో కారు ఇప్పుడు చాలా సైలెంటుగా, స్మూత్‌గా ఉంటుంది. దీని షాక్-అబ్జార్వర్‌లను మునుపటి కంటే మెరుగుపరచారు. దీని వలన రైడ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్త బ్యాటరీ ఆప్షన్‌లో కారు
కియా ఈవీ6ని కంపెనీ కొత్త బ్యాటరీ అప్‌డేట్‌తో రిలీజ్ చేసింది. దీని వలన సింగిల్ ఛార్జ్‌పై కారు రేంజ్ గణనీయంగా పెరిగింది. కియా ఈవీ6 ఇంతకు ముందు 77.4 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‌తో వచ్చేది. ఇప్పుడు కంపెనీ ఇందులో 84 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఫాస్ట్ ఛార్జర్‌పై దీని బ్యాటరీ కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని టాప్ మోడల్‌లో 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది.
Also Read : ఇక 5రోజులే.. తక్కువ ధరకు కారు కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి