Car Sefety Features
Safety Features: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)ఎనిమిది మందికి పైగా ప్రయాణించే ప్రయాణీకుల వాహనాల కోసం కొత్త భద్రతా నిబంధనలను తీసుకురానుంది. ఈ నిబంధనలు బస్సులు, ట్రక్కులతో పాటు ఎనిమిది మందికి పైగా ప్రయాణించే అన్ని కొత్త ప్యాసింజర్ వెహికల్స్ కు వర్తిస్తాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEBS), డ్రైవర్‌ను నిద్ర నుంచి అప్రమత్తం చేసే సిస్టమ్ (DDAWS), లేన్ డిపార్చర్ అలర్ట్ సిస్టమ్ (LDWS) వంటి లేటెస్ట్ ఆటోమోటివ్ సేఫ్టీ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
Also Read : ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 650కి.మీ.. కియా నుంచి నయా ఎలక్ట్రిక్ కార్
మీడియా నివేదికల ప్రకారం.. MoRTH మోటారు వాహన నిబంధనలలో పెద్ద మార్పులను ప్రతిపాదించింది. దీని ప్రకారం కొన్ని ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. ఈ మార్పులతో భారత ప్రభుత్వం దేశంలో వాహనాలను మరింత సురక్షితంగా మార్చాలని చూస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యూరోపియన్ యూనియన్‌లో అన్ని కొత్త మోటారు వాహనాలు రోడ్డు భద్రతను పెంచడానికి ADAS టెక్నాలజీను కలిగి ఉన్నాయి. దీంతో ఇండియాలో కూడా MoRTH ఈ ప్రతిపాదన చేసింది.
కొత్త నిబంధన ఏప్రిల్ 2026 నుంచి అన్ని పెద్ద ప్యాసింజర్ వెహికల్స్, బస్సులు , ట్రక్కులకు తప్పనిసరి కావచ్చు.ఇప్పటికే ఉన్న వాహన నమూనాలకు ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 2026 నుండి అమల్లోకి వస్తాయి. దీనితో పాటు దేశంలో బస్సులు, ట్రక్కులలో ఆన్‌బోర్డ్ బ్లైండ్ స్పాట్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా తప్పనిసరి చేయవచ్చు. ఇది సమీపంలో ఉన్న పాదచారులు, బైక్, స్కూటర్, సైకిల్ నడిపే వారి ఉనికిని గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ నిబంధనలు మొదట మినీ, రెగ్యులర్ బస్సులకు వర్తిస్తాయి. ఆ తర్వాత ట్రక్కులకు కూడా వర్తింపజేయవచ్చు.
ఈ సేఫ్టీ సిస్టమ్ ఎలా పనిచేస్తాయి?
AEBS (అడ్వాన్స్‌డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్): ఈ వ్యవస్థ వాహనం డ్రైవర్‌ను రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది. డ్రైవర్ స్పందించకపోయినా ఎమర్జెన్సీ బ్రేక్‌లను ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. ఇది వాహనాన్ని వేగంగా తగ్గించడంతో పాటు ఢీకొనడాన్ని నివారించడానికి ఆటోమేటిక్ బ్రేక్‌లను వేస్తుంది.
DDAWS (డ్రైవర్ డ్రౌజీనెస్ అండ్ అటెన్షన్ వార్నింగ్ సిస్టమ్): ఈ ఫీచర్ స్టీరింగ్ కదలికలు, వాహనం లేన్ స్టేటస్, డ్రైవర్ ముఖ కవళికలను ట్రాక్ చేయడం వంటి అనేక కదలికలను విశ్లేషించడం ద్వారా డ్రైవర్‌ను నిరంతరం గమనిస్తుంది. డ్రైవర్ నిద్రపోతున్నట్లు సిస్టమ్ గుర్తిస్తే, డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి అలర్ట్ చేస్తుంది.
LDWS (లేన్ డిపార్చర్ అలర్ట్ సిస్టమ్): ఈ సిస్టమ్ వెహికల్ అనుకోకుండా తన లేన్‌ను దాటి వెళుతున్నప్పుడు డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సాయపడుతుంది
Also Read : మారుతి ఫ్రాంక్స్ vs టాటా పంచ్.. మైలేజ్ ఎవరిది? సేఫ్టీ ఎవరికి ?