https://oktelugu.com/

Kia car sales : Kia కార్ల షాకింగ్ అమ్మకాలు.. ఐదేళ్లలో రికార్డు.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..

కియా కంపెనీ ప్రారంభమై త్వరలో 5 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా కియాకు సంబంధించిన వివరాలను బయటపెట్టబోతుంది. కానీ ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కంపెనీ ఇప్పటి వరకు 10 లక్షల వాహనాలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది రికార్డు అమ్మకాలే అని చెప్పవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2024 / 12:42 PM IST

    Kia car sales

    Follow us on

    Kia car sales : దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కార్లు భారతదేశంలో దూసుకుపోతున్నాయి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే సోనెట్, సెల్టోస్, కారెన్స్, కార్నివాల్ అనే మోడళ్లు భారత్ లో ప్రాచుర్యం పొందాయి. ఎస్ యూవీ వేరియంట్ కావాలనుకునే వారికి కియా కార్లు బాగా నచ్చుతాయి. అయితే ఎస్ యూవీ ఫార్మాట్ లో ఎన్ని కార్లు వచ్చినా లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఆధునిక ఫీచర్స్ కలిగిన కియా కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. దీంతో భారత్ కు వచ్చిన ఈ కంపెనీ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులు అందించి టాప్ లెవల్లో దూసుకుపోతుంది. కియా కంపెనీ ఇండియాలో ప్రారంభమై త్వరలో 5 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ కాలంలో ఈ కంపెనీ నుంచి ఎన్ని కార్లు సేల్స్ అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..

    కియా కంపెనీ ఇండియాలో 2017లో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో నెలకొన్న ప్లాంట్ ద్వారా కియా కార్లు ఉత్పత్తి ని 2019 నుంచి ప్రారంభించారు. ముందుగా ఈ కంపెనీ సెల్టోస్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఆ తరువాత పలు మోడళ్ల ను ఉత్పత్తి చేశారు. అయితే కియా కార్లు ఉత్పత్తి ప్రారంభించిన రెండేళ్ల నాటికి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి లాభాల బాటలో కొనసాగింది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రపంచం మొత్తం ఆదాయంలో 5 శాతం భారత్ ద్వారా పొందుతోంది. 2020 నాటికి ఈ కంపెనీ మొత్తం 3 లక్షల వాహనాలను మార్కెట్లో విక్రయించింది.

    కియా కంపెనీ ప్రారంభమై త్వరలో 5 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా కియాకు సంబంధించిన వివరాలను బయటపెట్టబోతుంది. కానీ ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కంపెనీ ఇప్పటి వరకు 10 లక్షల వాహనాలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది రికార్డు అమ్మకాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే కంపెనీ ప్రారంభమైన 5 ఏళ్లలో 10 లక్షల మైలు రాయి దాటడం మామూలు విషయం కాదని కొందరు కొనియాడుతున్నారు. మార్కెట్లో ఎక్కువగా ఆదరణ ఉన్న మారుతి, టాటా, హ్యుందాయ్ కంపెనీలకు కియా కార్లు గట్టి పోటీ ఇస్తున్నాయి.

    కొన్ని వర్గాల సమాచారం మేరకు కియా నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి కారు సెల్టోస్ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది ప్రస్తుతం 48 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఈ కారు తరువాత సోనెట్ కు ఆదరణ లభిస్తోంది. ఆ తరువాత కేరెన్స్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలుస్తోంది. ఇక కియా నుంచి ఈవీ 6 అనే ఎలక్ట్రిక్ కారును కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు.

    అయితే కియా కార్లు ఎస్ యూవీ వేరియంట్ తో పాటు డిజైన్, ఫీచర్స్ రిచ్ లుక్ లో ఉంటాయి.ఇవి ఖరీదైన వాహనాలతో పోటీ పడుతూ ఉంటాయి. అయితే కియా నుంచి నుంచి లేటేస్ట్ గా రిలీజ్ అయిన ఈవీ 6 ధర రూ.60.97 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 65.97 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఇవి కేవలం సంపన్నులు, సెలబ్రెటీలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనికి ఆదరణ లభిస్తోంది.