https://oktelugu.com/

Ritu Choudhary : మొత్తం బయట పెట్టేసింది.. రీతు చౌదరి అందాల జాతరను చూసి తట్టుకోవడం కష్టమే

రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. బయట ప్రదేశాలకు వెళ్లిన, పండుగలు ఇలా ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో రీతూకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాని హల్ చల్ చేస్తోంది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 29, 2024 / 12:51 PM IST

    Rithu Chaudhary

    Follow us on

    Ritu Choudhary : ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ట్రై చేస్తున్నారు. ఇలా చాలమంది అమ్మాయిలు, అబ్బాయిులు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాపులర్ అవుతున్నారు. వాళ్ల అందచందాలతో కుర్రకారును మత్తెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలకు ఫోజులిచ్చి.. వాళ్ల హాట్ అందాలతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇలా కుర్రకారును మత్తెక్కించి.. ఈ మధ్య సోషల్ మీడియాను హల్‌చల్ చేస్తోంది యాంకర్ రీతూ చౌదరి. సిరియల్స్ ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రీతూ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. విజయవాడకు చెందిన రీతూ.. సీరియల్స్ ద్వారా తన కంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్ధస్త్‌లో కనిపించింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ చౌదరికి సోషల్ మీడియా చాలా ఫాలోయింగ్ ఉంది.

    మధ్య తరగతికి చెందిన రీతూ చౌదరి మొదట సీరియల్స్‌లో నటించింది. 2006లో అంతరాత్మ సీరియల్‌తో తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత గోరింటాకు, మిస్టర్ పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యులు, సూర్య వంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లో నటించింది. ఈ సీరియల్స్‌లో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. కేరింత, రామలీల, సరైనోడు వంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పలు షోల్లో పాల్గొంది. ముఖ్యంగా ప్రదీప్ పెళ్లి చూపులు షో తర్వాత ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచి పలు షోలకు యాంకరంగ్ చేయడం, షోలో పాల్గొనడం వంటివి చేస్తూ.. జబర్ధస్త్‌లో అలరించింది. ఇందులో కూడా అలరించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో వచ్చిన ప్రతి చిన్న అవకాశంలో తన టాలెంట్‌ని నిరూపించుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జబర్ధస్త్ నుంచి వచ్చేసింది. అప్పటి నుంచి పలు షోలకు యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

    రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. బయట ప్రదేశాలకు వెళ్లిన, పండుగలు ఇలా ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఈ మధ్య కాలంలో రీతూకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌తో సోషల్ మీడియాని హల్ చల్ చేస్తోంది. రోజురోజుకి తన గ్లామర్ ట్రీట్‌ను పెంచేస్తూ.. కుర్రాల మనస్సులను దోచేస్తుంది. తాజాగా ఓ వీడియోను పెట్టగా.. హాట్‌గా ఉందని నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు. రీతూ ఏంటి.. రోజురోజుకి ఇంత అందంగా తయారవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుంది. ఈ సీజన్‌లో రీతూ చౌదరి ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజముందో లేదో తెలియాలంటే బిగ్ బాస్ ప్రారంభం అయ్యే వరకు వేచి చుడాల్సిందే.