Kia Clavis : భారతదేశంలో పెద్ద కార్లకు క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. కేవలం ఎస్యూవీలే కాకుండా, మారుతి ఎర్టిగా, మారుతి XL6, కియా కారెన్స్, టయోటా రుమియన్ వంటి 7-సీటర్ వాహనాలను కూడా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇదే సెగ్మెంట్‌లో కియా ఇండియా ఒక కొత్త కారును తీసుకురాబోతోంది. దీని మొదటి లుక్ ఈరోజు రిలీజ్ కానుంది.
ఈ కొత్త కారు కియా కారెన్స్ మరో వెర్షన్. దీనికి కియా క్లావిస్(Kia Clavis) అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన కొన్ని లీక్డ్ ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అంతేకాకుండా, కంపెనీకి చెందిన కొన్ని డీలర్‌షిప్‌లలో దీని అనధికారిక బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి.
కియా కారెన్స్, కియా క్లావిస్
కియా క్లావిస్ రాబోయే రోజుల్లో కియా కారెన్స్‌ను రీప్లేస్ చేయదు. ఇది ఒక ఎక్స్ ట్రా లైనప్ మాత్రమే. మారుతి ఎర్టిగా, మారుతి XL6 మధ్య ఎలాంటి సంబంధం ఉందో, కియా కారెన్స్, కియా క్లావిస్ మధ్య కూడా అలాంటి సంబంధమే ఉండబోతోంది. కియా క్లావిస్ ఒక విధంగా కియా కారెన్స్ మరింత ప్రీమియం వెర్షన్ కానుంది.
Also Read : కొత్త రికార్డు సృష్టించిన ‘కియా’..
కియా క్లావిస్‌లో ఉండే ప్రత్యేక ఫీచర్లు
కియా క్లావిస్‌కు సంబంధించినంతవరకు తెలిసిన సమాచారం ప్రకారం.. ఇందులో అనేక ప్రత్యేక ఫీచర్లు ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఇది డిజైన్ అప్‌డేట్‌తో కూడా వస్తుంది, అంటే ఇది కియా కారెన్స్ సేమ్ టు సేమ్ కాపీ కాదు. కియా క్లావిస్ డిజైన్ లాంగ్వేజ్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. దీని బంపర్ చాలా మస్క్యులర్‌గా ఉండనుంది. ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్ సెట్‌లు ఉంటాయి. అంతేకాకుండా కారుకు రూఫ్ రైల్ జోడించబడింది. దీని లైటింగ్ కూడా మార్చారు.
కియా క్లావిస్‌లో మీకు లెవెల్-2 ADAS లభిస్తుంది. కొత్త LED ప్రొజెక్టర్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, కొత్త ఇంటీరియర్ కలర్స్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఈ కారులో వస్తాయని భావిస్తున్నారు. ఈ కారులో కియా కారెన్స్‌లో ఉన్న ఇంజన్‌లే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్,1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తాయి. ఈ కారును కంపెనీ నేరుగా మారుతి XL6కి పోటీగా విడుదల చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ.11 లక్షల దగ్గర ఉండవచ్చు.
Also Read : కియా సోనెట్ కొత్త మోడల్ చూశారా? ఫీచర్స్ అదిరిపోయాయి..