Kia Car: దేశీయ కార్ల మార్కెట్లో ‘కియా’ దూసుకుపోతుంది. లేటేస్ట్ ఫీచర్స్ తో పాటు అప్డేట్ ఇంజిన్ తో కొత్త మోడళ్లు కియా నుంచి వచ్చి ఆకర్షిస్తున్నాయి. లేటేస్టుగా కియా నుంచి ‘సీడ్’ రాబోతుంది. ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతోంది. 2026 మార్చి నెలలో ఈ సీడ్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ తో గరిష్టంగా 5గురు కూర్చునేందుకు వీలుగా ఉండే ఈ వెహికల్ గురించి వివరాల్లోకి వెళితే..
కియా సీడ్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. చూడగానే కొనేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది హ్యాచ్ బ్యాక్ అయినా వెడల్పు ఎక్కువగా ఉంటుంది. దీని వెడల్పు 1800 ఎంఎం గా ఉండడం విశేషం. ఎత్తు 117 ఎంఎంగా విస్తరించి ఉంది. వీల్ బేస్ 2650 గా ఆకర్షిస్తుంది. దీని ఇంజిన్ విషయానికొస్తే 1198 సీసీతో పనిచేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు 4 సిలిండర్ పెట్రోల్ ను కలిగి ఉంది.
కియా సీడ్ ను రూ.9 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. టాప్ ఎండ్ రూ.12 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పికే కియా అంటే ఇష్ట మున్న వారు దీనిని బుక్ చేసుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నా వినియోగదారులను నచ్చే విధంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన కియా సెల్టోస్ వలె ఇది కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు.