Fruits: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవే

Most Expensive Fruits జపాన్ దేశంలోని హక్కైడో ద్వీపంలో పండుతుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ పండదు. ఇది ఖర్బుజ రకానికి చెందిన పండు. దీని గుజ్జు అమృతం లాగా ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 16, 2024 10:15 am
Follow us on

Most Expensive Fruits: పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో ఇవి ప్రత్యేకమైనవి. పూర్వకాలంలో ఆదిమానవుడు ఆహారం తయారు చేసుకునే అంతవరకు ఈ పండ్లనే ఆహారంగా తినేవాడట. ఆహారమైతే వండుకొని తినాలి. కానీ పండ్ల విషయంలో అలాంటి శ్రమ ఉండదు. జస్ట్ చెట్టు మీద నుంచి తెంపుకొని.. శుభ్రంగా కడుక్కొని.. హాయిగా ఆరగించడమే.. పండ్లలో విటమిన్లు.. ఖనిజ లవణాలు.. శరీర వృద్ధికి సహకరించే అన్ని పదార్థాలు ఉంటాయి. అందుకే ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యులు పండ్లను తీసుకోమని చెబుతారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మనిషి జీవితంలో.. మనిషి శరీర వృద్ధిలో పండ్లకు ఉన్న ప్రాధాన్యాన్ని.. ఈ సృష్టిలో ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి.. అవి కాలానికి అనుగుణంగా లభిస్తూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా లభించే పండ్లల్లో ఖరీదైనవి కూడా ఉంటాయి. అలాంటి ఖరీదైన పండ్లు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

యుబారీ కింగ్ మెలోన్

ఇది జపాన్ దేశంలోని హక్కైడో ద్వీపంలో పండుతుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ పండదు. ఇది ఖర్బుజ రకానికి చెందిన పండు. దీని గుజ్జు అమృతం లాగా ఉంటుంది. పైన ఉన్న తొక్కను తీసేస్తే పండు మొత్తాన్ని అవలీలగా లాగిన్ చేయవచ్చు. ఈ పండ్లను ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అత్యంత ఇష్టంగా తింటారు. ఈ పండును అక్కడి రైతులు ప్రత్యేక పద్ధతుల్లో పండిస్తారు. బహిరంగ మార్కెట్లో ఈ పండు కిలో ధర వచ్చేసి 20 లక్షల దాకా ఉంటుంది. ఈ పండుకు జియోగ్రాఫికల్ ఇండెక్స్ కూడా ఉంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ పండించడం కుదరదు. పైగా దీని గుజ్జు తింటే చర్మం నాజూగ్గా మారుతుంది. వివిధ రకాల క్యాన్సర్ లను ఇది నివారిస్తుంది.

డెన్సుకే పుచ్చకాయ

ఇది కూడా జపాన్ ప్రాంతంలోనే పండుతుంది. ఉత్తర జపాన్ ప్రాంతం లో ఈ పంటను విస్తారంగా పండిస్తారు. దీని గుజ్జు చాలా రుచిగా ఉంటుంది. కాయ రంగు కూడా ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. దీని గుజ్జులో గింజలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ పండ్ల కిలో ధర వచ్చేసి 21 వేల రూపాయల వరకు ఉంటుంది.

రూబీ రోమన్ గ్రేప్స్..

జపాన్ లోని ఇషి కావా ప్రాంతంలో దీన్ని సాగు చేస్తారు. ఇది అక్కడ మాత్రమే పండుతుంది. జపాన్ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ద్రాక్షను అభివృద్ధి చేశారు. ఈ పండ్లు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. 1995 నుంచి ఇషికావా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. 2016లో ఈ ద్రాక్ష గుత్తిని తొమ్మిది లక్షలకు విక్రయించారు. 2020లో ద్రాక్ష గుత్తికి వేలంపాట నిర్వహించగా అది 400 డాలర్లకు అమ్ముడుపోయింది. కేవలం సంపన్నులు మాత్రమే ఈ ద్రాక్ష పండ్లు కొనుగోలు చేస్తారు.

మియాజాకి మామిడి

మియా జాకీ మామిడి మొక్కల పెంపకం 1940లో కాలిఫోర్నియాలో ప్రారంభమైంది.. ఆ తర్వాత జపాన్ దేశంలోని మియా జాకీ ప్రాంతంలో ఈ మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. ఇది అత్యంత అరుదైన మామిడిపండు.. టెంక చిన్నగా ఉండి విపరీతమైన గుజ్జు ఉంటుంది. మామిడికాయ కూడా ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ఈ కేజీ మామిడి పండ్ల ధర లక్ష రూపాయల వరకు ఉంటుంది. కేవలం ఆగర్భ శ్రీమంతులు మాత్రమే ఈ పండ్లను కొనుగోలు చేస్తారు. ప్రత్యేకమైన పద్ధతుల్లో పెంచుతారు కాబట్టే ఈ పండ్లకు అంత డిమాండ్ ఉంటుంది.

డెకో పాన్ సిట్రస్

ఉత్తర జపాన్ ప్రాంతంలో ఇది విరివిగా పండుతుంది. నారింజ, ద్రాక్ష కలయిక ద్వారా ఈ రకం నారింజ మొక్కలను ఉత్పత్తి చేశారు. ఇందులో గింజలు ఉండవు. పండు కూడా చాలా తీపి గా ఉంటాయి. ఈ ఫలాలలో సిట్రస్ అధికంగా ఉంటుంది. స్కర్వి వ్యాధితో బాధపడేవారు ఈ పండ్లను తింటే ఉపయుక్తంగా ఉంటుంది. ఈ పండ్ల కిలో ధర వచ్చేసి లక్ష పైచిలుకు ఉంటుంది. ఈ పండ్లను ఎంపిక చేసిన వారికి మాత్రమే అక్కడి రైతులు విక్రయిస్తారు.

సైకి ఇచి యాపిల్

జపాన్ లోని శీతల ప్రాంతమైన సైకి ఇచి ప్రాంతంలో ఈ యాపిల్ పండ్లు పండుతాయి. ఇవి రుచికి చెర్రీ పండ్ల లాగా అనిపిస్తాయి. ఇవి డిసెంబర్ జనవరి మాసంలో మాత్రమే లభ్యమవుతాయి. వీటి ధర కిలో 70 వేల వరకు ఉంటుంది. ఈ పండ్లను తింటే చర్మం ముడుతలు తగ్గిపోతాయని వీటిని పండించే రైతులు చెబుతుంటారు.

వైట్ జ్యువెల్ స్ట్రాబెరీస్

సాధారణంగా స్ట్రాబెరీలు ఎరుపు లేదా గులాబీ వర్ణంలో ఉంటాయి. జపాన్ లో పండే స్ట్రాబెరీలు మాత్రం వైట్ కలర్ లో ఉంటాయి. అందుకే వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటి రుచి కూడా తీపిగా ఉంటుంది. సాధారణమైన స్ట్రాబెరీలు తీపి పులుపు కలయికతో ఉంటాయి. కానీ ఈ వైట్ జువెల్ స్ట్రాబెరీలు తీయగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయని చాలామంది నమ్ముతారు. కిలో పండ్ల ధర 50 వేల వరకు ఉంటుంది.

సెంబికియా క్వీన్ స్ట్రాబెరీ

ఈ పండు పేరులోనే క్వీన్ ఉందంటే.. ఇది కేవలం మహారాణులు మాత్రమే తినే పండు అని అర్థం. ఇది జపాన్ ప్రాంతంలో మాత్రమే పడుతుంది. అది కూడా డిసెంబర్ జనవరి నెలల్లో మాత్రమే లభ్యం అవుతుంది.. వీటిని తింటే సగటు ఆయుర్దాయం పెరుగుతుందని పూర్వకాలంలో రాణులు నమ్మేవారట. అందుకే ఈ పండ్లను విపరీతంగా తినేవారట. కాలానుగుణంగా ఈ పండ్లల్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ముదురు ఎరుపు వర్ణంలో పండే పండ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ పండ్ల కిలో ధర 70 వేల వరకు ఉంది.

బుద్ధ ఆకారపు బేరి పండ్లు

సాధారణంగా మన ప్రాంతాల్లో భేరి పండ్లు చిన్నవిగా ఉంటాయి. పైగా అందులో గింజలు కూడా ఉంటాయి. జపాన్ ప్రాంతంలో పండే పండ్లు బుద్ధుడి ఆకారంలో ఉంటాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం. శాస్త్రవేత్తల ప్రయోగాల ఫలితంగా బేరి పండ్లు బుద్ధుడి ఆకారంలో కాస్తాయి. ఇవి రుచికి అత్యంత తియ్యగా ఉంటాయి. కిలో బేరిపండ్ల ధర లక్షల్లోనే ఉంటుంది.

హెలికాన్ పైనాపిల్స్

ఇవి ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్రాంతంలో పండేవి. ఆ తర్వాత జపాన్ రైతులు కూడా వీటిని పండించడం మొదలుపెట్టారు. ఈ పండ్లు పూర్తి ముదురు పసుపు వర్ణంలో ఉంటాయి. ఇవి రుచికి తీపి పులుపు కలయికతో ఉంటాయి. ఈ పండ్లను తింటే క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవని నమ్ముతుంటారు. కిలో పండ్లధర బహిరంగ మార్కెట్లో రెండు లక్షల వరకు ఉంటుంది. ఈ పండ్లు కేవలం జనవరి మాసంలో మాత్రమే లభిస్తాయి.