https://oktelugu.com/

Job termination: ‘ఉద్యోగం అవసరం లేనివారు చేతులెత్తండి..’: ఓ కంపెనీ వినూత్న పద్దతిలో తొలగింపు..

చాలా కంపెనీలు ఉద్యోగులను నిర్మోహ మాటంగా తీసేయడంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఓ కంపెనీ ఉద్యోగులను తీసేసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

Written By:
  • Srinivas
  • , Updated On : March 7, 2024 2:08 pm
    Jobs Termination

    Jobs Termination

    Follow us on

    Job termination: కరోనా కాలం తరువాత ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు సైతం తమ కొలువు ఎప్పుడు ఊడుతుందో తెలియకుండా ఉంది. అయితే కరోనా తరువాత బిగ్ కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అయితే చాలా కంపెనీలు ఉద్యోగులను నిర్మోహ మాటంగా తీసేయడంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఓ కంపెనీ ఉద్యోగులను తీసేసేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. తమ కంపెనీల్లో పనిచేయడం ఇష్టం లేనివారు చేతులెత్తండి.. అంటూ చెప్పడంపై ఆసక్తి చర్చ సాగుతోంది.

    దేశంలో ప్రముఖ ఐబీఎం కంపెనీ గురించి ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి తెలిసే ఉంటుంది. ఇటీవల ఈ కంపెనీ తన ఆర్థిక లక్ష్యాల ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరిలో 4వ త్రైమాసిక ఫలితాల సందర్భంగా లేఆఫ్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ఆర్థిక పరమైనది కాకుండా సమతుల్యతగా చూడాలని పేర్కొంది. 2024 ఏడాది చివరి నాటికి 3 బిలియన్ల లక్ష్యమని ప్రకటించింది. ఇందులో భాగంగా 80 శాతం ఎంటర్ ప్రైజేస్ ఆపరేషన్స్ లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించింది.

    ఈమేరకు వారిని కొంతమందిని తీసేయడానికి కొత్త పద్దతిని ఎంచుకుంది. ఉద్యోగులను ఇష్టానుసారంగా తీసేయకుండా ఎవరైనా ఉద్యోగాల నుంచి తప్పుకోగలుగుతున్నారా? అని అడిగింది. అంటే ఉద్యోగం ఇష్టం లేనివారు చేతులెత్తండి అంటూ ప్రకటించింది. అంటే ఉద్యోగాలు చేయలేని వారు ఉంటే ముందుకు రావాలని పరోక్షంగా తెలిపింది. ఈ నిర్ణయంతో కొందరు ఇష్టం లేని వారు ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారని, అవసరం ఉన్నవారు జాబ్స్ లో కొనసాగుతారని తెలిపింది.

    ఇప్పటి వరకు పలు కంపెనీలు వివిధ కారణాల చేత ఉద్యోగాల నుంచి తొలగించింది. కొందరి విషయంలో నైపుణ్యాన్ని ప్రమాణికంగా తీసుకొని వారిపై వేటు వేయగా..మరికొందకి మాత్రం వర్క్ ఫ్రం చేసేవారు కార్యాలయాలకు తప్పనిసరిగా రావాలని, లేకుంటే ఉద్యోగా లనుంచి తీసేస్తామని హెచ్చరింది. ఈ క్రమంలో కొందరు తమ ఉద్యోగాలను స్వచ్ఛందగా వదులుకున్నారు. ఇప్పుడు ఈ పద్దతి కూడా సక్సెస్ అవుతుందని ఐబీఎం కంపెనీ భావిస్తోంది.