Job Market: మారుతున్న కాలానికి అనుగుణంగా జాబ్ మార్కెట్ కూడా మారుతోంది. కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్లార్‌లో కాలానికి అనుగుణంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీంతో అనేక ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. ఇదే సమయంలో అంతకు మించిన ఉద్యోగాలు వస్తున్నాయి.
ఈ తరుణంలో ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉంటుంది. ప్రపంచ ఆర్థిక నివేదిక ఇటీవల వెలువరించిన ప్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్టు 2025 అంచనాల ప్రకారం 2030 నాటికి 92 మిలియన్ల జాబులు మాయమవుతాయి. అదే సమయంలో 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని అంచనా వేసింది.
అంచనాలు ఇలా…
– ప్రస్తుతం ఉన్నవాటికన్నా 2030 నాటికి 78 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ఇదే సమయంలో ఉన్న కొలువుల్లో అంతగా సృజనాత్మకత అవసరం లేనివి ఆటోమేషన్ కారణంగా కనుమరుగవుతాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి జాబ్స్‌లో ఉన్నవారు నైపుణ్యాలు మెరుగు పర్చుకోవాలని సూచించింది.
– ఏఐ, రోబోటిక్స్ వంటి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగార్థులకు ఇప్పటికే డిమాండ్ ఉంది. 2024లో జెనరేటివ్ ఏఐ కోర్సులో వివిధ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా లక్షల మంది నమోదు చేసుకున్నారు. తగిన శిక్షణ పొంది కెరియర్‌లో ముందుకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు.
– ఆర్ఠిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కెరియర్లు మరింతగా ఊపందుకుంటాయి. క్లరికల్ వర్క్స్ వంటివి తగ్గుతాయి. టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతాయి. భవిష్యత్‌లో ఉద్యోగాల సంఖ్య మాత్రమే కాకుండా పనిచేసే తీరులోనూ మార్పు వస్తుందని ఈ నివేదిక తెలిపింది.
– స్కిల్ గ్యాప్.. ఈ నివేదికలో మరో ముఖ్యమైన అంశం నైపుణ్యాల మధ్య అంతరం(స్కిల్ గ్యాప్). ఇప్పుడు అవసరం అవుతున్న స్కిల్స్‌లో దాదాపు 40 శాతం 2030 నాటికి కనుమరుగవుతాయని తెలిపింది. కొత్తవి నేర్చుకోకపోతే ఆ ఉద్యోగులు మార్కెట్‌లో నిలదొక్కుకోలేరని తెలిపింది.
– ఇప్పుడు ఉన్న 63 శాతం మందికి ఇటువంటి అడ్డంకి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా వర్క్ ఫోర్న్‌స్ మార్పునకు సంసిద్ధం చేయడంలో ఆన్‌లైన్ లెర్నింగ్ నివేదికలు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. వీటిని ఉపయోగించుకుని స్కిల్ గ్యాప్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
భారీగా పెరిగే వాటిలో ముందు ఉన్నవి..
బిగ్ డేటా స్పెషలిస్ట్..
గంపగుత్తగా ఉన్న డేటా నుంచి కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం, ట్రెండ్స్‌ను అంచనా వేయడం, సంస్థ మరిన్ని సమర్థ నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఈ ప్రొఫెషనల్స్ డేటా మైనింగ్, రీసెర్చ్, డేటా అలలిస్ట్, డేటా అండ్ అలనిటిక్స మేనేజర్, బిజినెస్ ఇంటిలిజెన్స్ అనలిస్ట్.. ఇలా పలు రకాల పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ డేటా అనలిటిక్స్ వంటి సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్నవారు కెరియర్‌లో రాణిస్తారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేసెస్, ఎస్క్యూఎల్ వంటి అంశాలపై అవగాహన ఉంటే సులభంగా ప్రవేశించవచ్చు.
ఫిన్ టెక్ ఇంజినీర్..
– ఫైనాన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను కలిపితే వచ్చేవే ఫిన్టిక్ కెరియర్లు దీనిలో రాణించేవారు ఇంజినీర్లు, ఈ సెక్టార్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వంటి పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇంలో చేరాలనుకునే విద్యార్థులకు ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలి. టెక్నికల్, సాఫ్ట్ నైపుణ్యాలు ఉండాలి. దీంతో ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్.. ఇలా అనేక పాత్రల్లో ఒదిగిపోవచ్చు.
ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్..
– ప్రపంచమంతా టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది.ఏఐ ఈ శతాబ్దపు అత్యంత ఆవశ్యకమైన ఆవిష్కరణలు చేస్తుంది. ఇప్పటికే నేల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోట్లు వంటివి ఈ కోవలో ఉన్నాయి. అందుకే ఏఐ, ఎంఎల్ ఎన్నో విధాలైన కెరియర్లకు మూలం కాబోతోంది. డేటా సైంటిస్ట్, మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్, రీసెర్చ్ సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్, ఏఐ డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఇంజినీరింగ్, రోబోటిక్స్ సైంటిస్ట్, ఏఐ ఇంజినీర్ తదితర విధాలుగా ఉద్యోగాలు ఉంటాయి.
సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్.
– వీరు కంప్యూటర్ అప్లికేషన్స్‌ను డిజైన్ చేస్తారు. వినియోగదారులు ఉపయోగించే అనిన విధాలైన అప్లికేషన్లు, గేమ్స్, సాప్ట్‌వేర్లు సంస్థలకు డేటాబేస్‌లు వంటివి తయారు చేస్తారు. దీనికి బ్యాచిలర్ డిగ్రీతోపాటు తగిన అర్మతలు ఉండాలి. టెక్నాలజీలో ఎ ప్పటికప్పుడు మార్పులను అందిపుచ్చుకోవాలి.
సెక్యూరిటీ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్..
– ఒక సంస్థ సైబర్ రక్షణ విషయంలో డిజైన్, దాని అమలు, నిర్వహణ ఇలా మొత్తం చేసేవారు సెక్యూరిటీ మెనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌లు. ఏవైనా రక్షణ లోపాలు ఉన్నా, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నా ముందుగా మేలుకుని తగిన చర్యలు తీసుకుంటారు. సెక్యూరిటీ ఆడిట్, రిస్క్ అనాలిసిస్, సిస్టమ్ ఇన్‌స్పెక్షన్ లాంటి మొత్తం అంశాలు వీరే చూసుకుంటారు. బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్, కస్టమర్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ లాంటి అంశాలపై అవగాహన ఉండాలి.
– ఇంకా డేటా వేర్ హౌసింగ్ స్పెషలిస్ట్, అటానమస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ స్పెషలిస్ట్, యూఐ అండ్ యాక్స్ డిజైనర్స్, ఐవోటీ స్పెషలిస్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజినీర్ ఇలా పలు ఉద్యోగాలు పెరిగే జాబితాలో ఉన్నాయి.