Mohan Babu Vs Manoj
Mohan Babu Vs Manoj: మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొంది. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు మనోజ్ మరొక వైపు చేరారు. వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. చాలా కాలంగా మనోజ్ కి మోహన్ బాబు, విష్ణులతో సఖ్యత లేదు. ఆయన మోహన్ బాబు ఇంట్లో ఉండటం లేదు. 2023లో భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లిని అక్క మంచు లక్ష్మి జరిపించింది. మోహన్ బాబు, విష్ణు చివరి రోజు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. మోహన్ బాబు హైదరాబాద్ నగర శివారులో గల జుల్పల్లిలో ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. అక్కడే మౌనికతో పాటు మనోజ్ ఉంటున్నట్లు సమాచారం.
ఇటీవల మోహన్ బాబు, మనోజ్ పరస్పరం దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. ఆరోపణలు చేసుకున్నారు. తిరుపతిలో గల శ్రీ విద్యా నికేతన్ యూనివర్సిటీ లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మోహన్ బాబు, విష్ణులపై మనోజ్ ఆరోపణలు చేశాడు. తాగుడుకు బానిసైన మనోజ్.. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు విమర్శలు గుప్పించాడు.
సోషల్ మీడియాలో కూడా వార్ కొనసాగుతుంది. ప్రతి కుక్కకు సింహం అవ్వాలని ఉంటుంది.. అని విష్ణు ఒక పోస్ట్ పెట్టాడు. దానికి కౌంటర్ ఇస్తూ… విష్ణు కన్నప్ప మూవీపై సెటైర్ వేశాడు మనోజ్. మోహన్ బాబు-మనోజ్ ల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. కాగా మోహన్ బాబు-మనోజ్ లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ హోదాలో విచారించారు. మేజిస్ట్రేట్ ఎదుటే తండ్రి కొడుకులు దూషణకు దిగినట్లు సమాచారం.
తాను స్వయంగా కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్ తో మనోజ్ కి సంబంధం లేదు. తన ప్రాపర్టీస్ నుండి మనోజ్ ని బయటకు పంపాలని మోహన్ బాబు పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది. మనోజ్ ని జుల్పల్లి నివాసం బయటకు పంపాలి అనేది.. మోహన్ బాబు ఆలోచన అట. ఆస్తులు మొత్తం పెద్ద కొడుకు విష్ణుకు మోహన్ బాబు కట్టబెట్టాడు అనేది మనోజ్ అసహనానికి కారణం. నెలల తరబడి సాగుతున్న ఈ పంచాయితీ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
మరోవైపు మనోజ్ నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో భైరవం మూవీ చేస్తున్నాడు. మరి కొన్ని చిత్రాలలో ఆయన నటిస్తున్నారు. ఇక విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారు.