Jio Starlink Deal: స్టార్‌లింక్(Star Link)ను భారతదేశానికి తీసుకురావడానికి ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్(SpaceX)తో భారత టెలికం దిగ్గజ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఒప్పందం కుదుర్చుకున్నాయి. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలోకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్‌తో జత కట్టాయి. దీంతో దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో తమ సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది.
Also Read: అంబానీ జియోను చావుదెబ్బకొట్టిన ఎయిర్ టెల్..ఏకంగా ఎలన్ మస్క్ తో జట్టు
భారత్‌లోకి ప్రవేశించాలన ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కల నెరవేరింది. ఈమేరకు అనుమతుల కోసం సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆ సంస్థతో భారత టెలికం కంపెనీలు అయిన ఎయిర్‌టెల్(Air tel), రిలయన్స్ జియో(Relance Jio) ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనుమతి లభించగానే జియో, ఎయిర్‌టెల్ దాని స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్టార్‌లింక్ సేవలు, పరికరాలను అందిస్తాయి. ఎప్పుడు విడుదల అవుతుంది? జియో, ఎయిర్‌టెల్ స్టార్‌లింక్ సేవలను ఎలా అందించాలని యోచిస్తున్నాయి అనే వివరాలు చూద్దాం.
ఎయిర్‌టెల్–స్పేస్‌ఎక్స్ ఒప్పందం: మార్చి 11, 2025న భారతి ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్‌టెల్ స్టార్‌లింక్ సామగ్రిని తన రిటైల్ స్టోర్‌లలో విక్రయించనుంది మరియు వ్యాపార కస్టమర్లకు సేవలను అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో(Rural Area)ని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడం కూడా ఈ ఒప్పందంలో భాగం. ఎయిర్‌టెల్ తన ఇప్పటికే ఉన్న నెట్‌వర్క్‌ను స్టార్‌లింక్‌తో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.
జియో–స్పేస్‌ఎక్స్ ఒప్పందం: మార్చి 12, 2025న రిలయన్స్ జియో స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం ప్రకటించింది, ఇది ఎయిర్‌టెల్ ఒప్పందానికి ఒక రోజు తర్వాత జరిగింది. జియో స్టార్‌లింక్ సామగ్రిని తన రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా అందించనుంది. ఇన్‌స్టాలేషన్, యాక్టివేషన్ కోసం కస్టమర్ సపోర్ట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది. జియో దీనిని తన జియోఫైబర్, జియోఎయిర్‌ఫైబర్(Jio Fiber Service) సేవలతో అనుసంధానం చేయాలని చూస్తోంది.
Also Read: ఆ కారుపై రూ.35,000 తగ్గించిన కంపెనీ.. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?