Homeబిజినెస్Airtel: అంబానీ జియోను చావుదెబ్బకొట్టిన ఎయిర్ టెల్..ఏకంగా ఎలన్ మస్క్ తో జట్టు

Airtel: అంబానీ జియోను చావుదెబ్బకొట్టిన ఎయిర్ టెల్..ఏకంగా ఎలన్ మస్క్ తో జట్టు

Airtel: ఇటీవల ముఖేష్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన జియో సినిమా (Jio cinema) డిస్నీ గ్రూప్ కు (Disney) చెందిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus hotstar) జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ఇవి రెండు కలిసి జియో హాట్ స్టార్ (jio hotstar)గా ఏర్పడ్డాయి. వినోద రంగంలో ఇవి రెండు పెద్ద సంస్థలు కావడంతో.. పోటీ సంస్థలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి.

 

Also Read: ఏటీఎం నుంచి 10 నిమిషాలలో గోల్డ్ లోన్ పొందవచ్చు.. భారతదేశంలోనే మొదటిసారి ఆ నగరంలో గోల్డ్ లోన్ ఇచ్చే ATM ప్రారంభం..

ఎంటర్టైన్మెంట్ రంగంలో నెట్ ఫ్లిక్స్(Netflix), అమెజాన్(Amazon), ఎయిర్టెల్(Airtel) వంటివి కూడా ఉన్నాయి. జియో హాట్ స్టార్ కలయికతో పై సంస్థలు ఒకింత కలత చెందాయి. మార్కెట్ మొత్తాన్ని జియో హాట్ స్టార్ దున్నేస్తుందని భయపడ్డాయి. అయితే ఇందులో ఎయిర్టెల్ ముందుగానే మేల్కొంది. జియో హాట్ స్టార్ తో ముప్పు రాకముందే సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మస్క్( Elon Musk) తో జట్టు కట్టింది. మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్(Space X) అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.. దీనిద్వారా స్టార్ లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ భారత్ లో అందిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఎయిర్టెల్ వివరించింది.. స్టార్ లింక్ కు భారత్ లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని ఎయిర్టెల్ వెల్లడించింది.. ఇరు సంస్థల సంబంధించి ఇటీవల ఒప్పందం కుదరడంతో.. పరస్పరం సహకరించుకుంటామని అంగీకారం తెలిపాయి.. దీని ద్వారా భారత్లో ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్ లింక్ సేవలు అందుతాయి. అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీ యూజర్లకు లభిస్తుంది. ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు యూజర్లకు లభిస్తాయి. మారుమూల గ్రామాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు లభిస్తాయి.. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్, స్పేస్ ఎక్స్ కలిసి స్టార్ లింక్ పరికరాలను యూజర్లకు అందిస్తాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తారు. స్టార్ లింక్ ద్వారా ఎయిర్టెల్ తన నెట్వర్క్ ను విస్తరిస్తుంది. నెట్వర్క్ సామర్ధ్యాలను పెంచుకుంటుంది. స్పేస్ ఎక్స్ కూడా ఎయిర్టెల్ కు క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటుంది.

ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా..

అమెరికాతో పోల్చుకుంటే భారత్లో ఎంటర్టైన్మెంట్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. దీని ఆధారంగా ప్రతి ఏడాది లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా హాట్ స్టార్ తో జట్టు కట్టింది. భారతదేశంలోనే ఈ ఎంటర్టైర్మెంట్ పరంగా అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. ఇందులో అపరిమితమైన కంటెంట్ యూసర్లకు లభించనుంది. అయితే ఇప్పుడు ఎయిర్టెల్, స్పేస్ ఎక్స్ కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో.. త్వరలో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఇవి రెండు కలిసి బలమైన సంస్థగా ఏర్పడతాయని తెలుస్తోంది. ఇప్పుడైతే వేగవంతమైన నెట్వర్క్ మీద దృష్టి సారించి.. ఆ తదుపరి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించాలని ఎయిర్టెల్, స్పేస్ ఎక్స్ భావిస్తున్నాయి. జియో రాకముందు మార్కెట్లో ఎయిర్టెల్ దే ఆధిపత్యం ఉండేది. జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్ మార్కెట్ ను కోల్పోవడం మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు స్పేస్ ఎక్స్ తో కలిసి జియో నెట్వర్క్ ను మాత్రమే కాకుండా.. జియో హాట్ స్టార్ పై కూడా ప్రతీ కారం తీర్చుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. “వేగవంతమైన నెట్వర్క్ త్వరలో సాధ్యమవుతుంది.. తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలో అసలైన సినిమా మొదలవుతుందని” ఎయిర్టెల్ వర్గాలు చెబుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular