Jio Vs Airtel Vs Vi: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల సౌకర్యం కోసం అనేక ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లలో వీలైనంత ఎక్కువ ప్రయోజనాలను చేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడు కంపెనీల ప్లాన్‌లలో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అయితే ఆ ప్లాన్‌లు ఏవి? వాటి ప్రయోజనాలను ఎలా పొందవచ్చు? వీటిలో ఏది చౌకైన ప్లాన్? ఇక్కడ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉచిత Netflixతో Jio ప్లాన్
జియో ప్లాన్‌లలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్లాన్‌లు ప్రత్యేకంగా ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో వస్తాయి. జియో రూ.1299 ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో మీకు ప్రతిరోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేక ఆఫర్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాక్సెస్. ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు JioTV, JioCinema సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
Airtel Netflix ప్లాన్:
ఎయిర్‌టెల్ ప్లాన్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్ లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎయిర్‌టెల్ రూ.1798 ప్లాన్ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల సౌకర్యం కోసం స్పామ్ కాల్స్, SMSల అలర్ట్స్ కూడా పంపుతుంది. ఉచిత హలోట్యూన్స్ , అపోలో 24/7 కూడా లభిస్తాయి.
Vi ప్లాన్‌లో ప్రయోజనం
Vi తన వినియోగదారులకు చౌకైన ప్లాన్‌లను అందిస్తుంది. రూ.1599 ప్లాన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్‌ను చూడవచ్చు. Vi ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMS, ప్రతిరోజూ 2.5GB డేటాను ఉపయోగించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వీక్లీ డేటా రోల్‌ఓవర్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.