Jio OTT subscription offer 500 rupees: మొబైల్ యూజర్లకు జియో టెలికాం సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటి వరకు రకరకాల ప్లాన్లతో ఆకర్షించిన ఈ సంస్థ ఈసారి ఎంటర్టైన్మెంట్ విభాగంలో కొత్త ప్లాన్లను తీసుకొచ్చొంది. ప్రీపెయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉన్న రూ. 500 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను ‘మెగా కంటెంట్ ప్లాన్’గా రీబ్రాండ్ చేయడమే కాకుండా, అదనంగా రూ. 200 ‘మెగా కంటెంట్ యాడ్-ఆన్ ప్యాక్’ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో OTTలు, యూట్యూబ్ ప్రీమియం, AI బెనిఫిట్స్ అందనున్నాయి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
జియో ప్రీపెయిడ్ యూజర్లు రూ. 500 తో రీఛార్జ్ చేసుకుంటే మెగా కంటెంట్ ప్లాన్ కు అర్హులవుతారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇందులో రోజుకు 2 GB హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఇందులో భాగంగా లభిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్లాన్‌లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కావడం విశేషం. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. జియో టీవీ యాప్ ద్వారా సోనీ లివ్, ZEE5, డిస్కవరీ+, సన్ NXT,హోయ్‌చోయ్, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కంచా లంక వంటి OTT ప్లాట్ ఫాంలను కూడా వినియోగదారులు యాక్సెస్ చేయవచ్చు.
జియో ఈ ప్లాన్‌ను కేవలం వీడియో స్ట్రీమింగ్‌కే పరిమితం చేయకుండా, గేమింగ్ మరియు క్లౌడ్ సేవలను కూడా జోడించింది. జియోగేమ్స్ మొబైల్ యాక్సెస్‌తో పాటు జియోAIక్లౌడ్ స్టోరేజ్ 50 GB వరకూ ఇస్తోంది. కాబట్టి ఈ ప్లాన్ సాధారణ రీచార్జ్ కంటే డిజిటల్ కంటెంట్ బండిల్‌గా నిలుస్తోంది.
అంతేకాకుండా గూగుల్ జెమినీ ప్రో బెనిఫిట్ కూడా ఇందులోనే రావడం విశేషం . జియో రూ.500 ప్లాన్‌తో 18 నెలల గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. మొత్తం 5000 GB క్లౌడ్ స్టోరేజీ, అదనపు AI ఫీచర్లు కూడా లభిస్తాయి. అయితే ఈ జెమినీ ప్రో యాక్సెస్‌ను 18 నెలలు కొనసాగించాలంటే వినియోగదారులు రూ. 349 లేదా అంతకంటే పైవిలువ గల అర్హత కలిగిన ప్లాన్లతో రీచార్జ్ కొనసాగించాల్సి ఉంటుంది.
మరో సూపర్ ప్లాన్ రూ. రూ.200 మెగా కంటెంట్ యాడ్-ఆన్ ప్యాక్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతోనే అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 5 GB హైస్పీడ్ డేటా లభిస్తుంది; ఆ తర్వాత డేటా స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. అయితే ఇది యాడ్-ఆన్ ప్యాక్ మాత్రమే కావడంతో, వాయిస్ కాల్స్, SMSలు, స్వతంత్ర సర్వీస్ వ్యాలిడిటీ ఇవేమీ ఇందులో ఉండవు.
రూ. 200 యాడ్-ఆన్‌లో కూడా యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియోహాట్‌స్టార్ మొబైల్+ హాలీవుడ్ యాక్సెస్ ఉన్నాయి. అదనంగా జియోటీవీ యాప్ ద్వారా సోనీ లివ్, ZEE5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, ఫ్యాన్‌కోడ్, హోయ్‌చోయ్ వంటి పలు OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే తక్కువ ధరలో కంటెంట్-ఫస్ట్ యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా ఈ యాడ్-ఆన్‌ను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది.
ఈ రెండు ఆఫర్లలో రూ.500 ప్లాన్ పూర్తి స్థాయి ప్రీపెయిడ్ రీచార్జ్‌గా పనిచేస్తే, రూ.200 ప్యాక్ మాత్రం ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న యూజర్లకు అదనపు కంటెంట్ బూస్టర్‌లా ఉంటుంది.