Beer Powder: ఎండలు దంచికొడుతున్నాయి.. ఈ టైంలో చల్లని నీరు తాగితే ఆ హాయే వేరు.. ఇంకాస్త కొంచెం ముందుకెళ్లి చల్లని బీరు స్విప్ చేస్తే ఆ కిక్కే వేరు.. మిగతా కాలాల్లో కంటే వేసవి కాలంలో మందుబాబులు ఎక్కువగా బీర్లనే కొరుకుంటాయి. దీంతో ఆ మూడు నెలలు వీటి అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే వైన్ కంటే బీరు చల్లగా ఉన్నప్పుడే తాగేయాలి. మరి చల్లని బీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. ఇలాంటి వారి కింగ్ ఫిషర్ కంపెనీ బాగా ఆలోచించి బీర్ పౌడర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనినే ‘ఇన్ స్టంట్ బీర్ పౌడర్ మిక్స్’అంటారు. మీరు అడవిలోకెళ్లినా.. నిర్మానుష్య ప్రదేశానికి వెల్లినా అక్కడ కొన్ని చల్లటి నీరు దొరికితే చాలు వెంటనే బీరు తయారు చేసుకొని తాగేయచ్చు. ఫ్రీజ్ డైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ ను ఇండియన్ కస్టమర్ల కోసం కింగ్ ఫిషర్ ప్రత్యేకంగా తయారు చేసింది. దాని గురించి తెలుసుకుందాం.
లిక్విడ్ బీర్ కూల్ పోయిందంటే ఇక దానిని తాగలేం. పోనీ నిల్వ చేసుకుని అవసరమున్నప్పుడు తీసుకుందామంటే కుదిరే అవకాశం ఉండదు. అయితే బీర్ సాచెట్స్ ను దగ్గరుంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్క నిమిషంలో బీర్ తయారు చేసుకొని తాగేయచ్చు. ఫ్రెండ్స్ కలిసి తాగినా.. పార్టీలు చేసుకున్నా.. అవసరమైనన్ని బీర్ ప్యాకెట్లు అందించడానికి కంపెనీ తయారు చేసింది. అయితే వీటిని ప్రస్తుతానికి ఆన్లైనోనే బుక్ చేసుకోవాలని కంపెనీ చెబుతోంది. ఆ తరువాత మార్కెట్లకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది.
మీ దగ్గర బీర్ సాచెట్స్ ప్యాకెట్ ఉందనుకోండి. ఓ మగ్గు లేదా లీటర్ బాటిల్ కూల్ వాటరు తీసుకోండి. వీటిలో బీర్ సాచెట్స్ పౌడర్ వేసి మిక్స్ చేయండి.. వెంటనే నురుగలు కక్కతున్న బీర్ తయారవుతుంది. ఈ బీర్ ను ఎప్పుడైనా.. ఎక్కడైనా.. తయారు చేసుకోవచ్చు. అయితే మాములు వాటర్ కంటే కూల్ వాటర్ లో అయితే బీర్ బాగుంటుంది. ఇక బీర్ సాచెట్స్ ను ఎలా పొందాలనేదానిపై కంపెనీ ఓ లింక్ ను పంపించింది kingfisherworld.com/instantbeerలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత కావాల్సినన్ని ప్యాకెట్లు ఆర్టర్ చేస్తే ఇంటికి వస్తాయి.
అయితే ఇదంతా నిజం కాదని, ప్రజల్ని ఫూల్స్ చేయడానికేనని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం తాము ప్యాకెట్స్ తెచ్చకున్నామని చూపిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. ఏదీ ఏమైనా కొందరి అవసరాల కోసం బీర్ ప్యాకెట్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇది సక్సెస్ అవుతుందా? లేదా? అనేది అనుమానమేనని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా వైన్స్ అందుబాటులో ఉన్న తరుణంలో సాచెట్స్ గురించి ఆలోచించరని అంటున్నారు. మరోవైపు ఇవి నాణ్యమైనవా? లేదా? అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు.