Jeff Bezos Success:విత్తు పాతగానే వెంటనే మొలకెత్తదు. దానికంటూ సమయం కావాలి. అంకురం పుట్టగానే పువ్వులు పూయదు. దానికంటూ ఒక పిరియడ్ ఉంటుంది. పువ్వు పూయగానే కాయ కాయదు. దానికి కూడా కొంత సమయం ఉంటుంది. కాయ కాయగానే పండు కాదు. దానికి కూడా ఒక వ్యవధి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఓపిక ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం పెట్టిన గింజ మొలకెత్తకపోవచ్చు. మొలకెత్తిన అంకురం పెరగకపోవచ్చు. పువ్వులు పూయకపోవచ్చు. కాయలు కాయకపోవచ్చు.. ఇన్ని ప్రతికూల సందర్భాల్లోనూ ఆశావాహ దృక్పథాన్ని వదులుకోవద్దు.. ఎందుకంటే అది లేకుంటే ఏదీ సాధ్యం కాదు. అతడికి అర్థమైంది కాబట్టే.. కష్టపడ్డాడు.. ఇబ్బంది పడ్డాడు. హేళనలు ఎదుర్కొన్నాడు.. చివరికి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీమంతుడిగా అవతరించాడు.
View this post on Instagram
ఇప్పుడు అమెజాన్ అనేది మనకు అతి పెద్ద కంపెనీగా కనిపిస్తోంది. ఈ కామర్స్ సంస్థల్లో అతిపెద్ద వ్యవస్థగా దర్శనమిస్తోంది. కానీ ఒకప్పుడు అమెజాన్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ సంస్థను ప్రారంభించిన ఏడు సంవత్సరాల వరకు జెఫ్ బెజోస్ ఒక రూపాయి కూడా లాభాన్ని సొంతం చేసుకోలేదు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాలేదు. సిలికాన్ వ్యాలీలో ఓ కంపెనీలో పని చేసిన జెఫ్.. ఇంటర్నెట్ విప్లవాన్ని ముందుగానే ఊహించి ఒక కంపెనీని ప్రారంభించాడు. అది కూడా పుస్తకాలను సరఫరా చేసే కంపెనీ.. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాల సంస్థగా తన కంపెనీని అతడు ప్రమోట్ చేసుకున్నాడు. ప్రమోట్ అయితే బాగానే చేశారు గాని.. గిరాకీ లేదు. ఏడు సంవత్సరాలపాటు రూపాయి లాభం కూడా లేదు. అప్పట్లో డాట్ కాం సంక్షోభం వచ్చినప్పుడు అమెజాన్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఒకానొక దశలో షట్ డౌన్ స్థాయి దాకా వెళ్ళింది. చివరికి జెఫ్ బెజోస్ ధైర్యం తెచ్చుకొని.. అనేక రకాల ప్రత్యామ్నాయలు ఊహించాడు. దానికి తగ్గట్టుగా కంపెనీని మలిచాడు.
Also Read: సోషల్ మీడియా అని తీసిపారేయకండి..ఈ ఇన్ ప్లూయన్సర్స్ మార్కెట్ విలువ అక్షరాల 3,400 కోట్లు..
వాస్తవానికి పుస్తకాల వ్యాపారంతో వచ్చిన లాభాలు ఆధారంగా కంపెనీ పేరు అమెరికాలో మారుమోగిపోయింది. దీంతో అతని కంపెనీ లిస్టెడ్ గా మారింది. పెట్టుబడులను ఆహ్వానించింది. ఇదే సమయంలో డాట్ కాం బూం వల్ల అమెజాన్ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ ఆ కంపెనీ చరిత్ర మొదటికి వచ్చింది. ఈ దశలో అనేక రకాలుగా ఆలోచించిన బెజోస్.. కంపెనీ రూపురేఖలను మార్చాడు.. అనేక విభాగాలకు మళ్ళించాడు.. దీంతో ఆ కంపెనీ తిరుగులేని స్థాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కు 200 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే.. ఆ కంపెనీ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాజిస్టిక్స్, వేర్ హౌస్, ఐటి, శాటిలైట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభాగాలలో అమెజాన్ అడుగుపెట్టింది.. తిరుగులేని స్థాయిని అందుకుంది.. ప్రస్తుతం ఎలాన్ మస్క్, బెజోస్ మధ్య వరల్డ్ రిచెస్ట్ చేర్ గేమ్ నడుస్తోంది. ఇందులో బెజోస్ చాలాసార్లు నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు. వచ్చే కాలంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించడానికి పోటీ పడుతున్నాడు. ఇక ప్రస్తుతం అమెజాన్ లో వెబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది అమెజాన్ కంపెనీకి బంగారు బాతు లాగా మారింది. చాలామంది అమెజాన్ ఈ కామర్స్ ద్వారా బెజోస్ కు డబ్బులు బాగా వస్తాయి అనుకుంటారు కానీ.. అమెజాన్ వెబ్ సర్వీస్ ద్వారా బెజోస్ బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ ద్వారా 12 మిలియన్ ఉత్పత్తులను విక్రయిస్తోంది.. ఒక సెకండు 1000+ డాలర్లకు మించి విక్రయాలు చేపడుతోంది. అంతేకాదు ఈ కంపెనీ విలువ ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఇంటర్నెట్లో మెజారిటీ వ్యాపారాన్ని ఆమెజాన్ వెబ్సైట్ చేపడుతోంది.