Coolie vs War 2 box office: ఇండియాలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళందరూ చేస్తున్న సినిమాలు వాళ్లకు భారీ గుర్తింపు ను సంపాదించి పెడుతున్నాయి… జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం హై వోల్టేజ్ సినిమాలను చేస్తున్నాడు. ఆగస్టు 14వ తేదీన వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ‘వార్ 2’ (War 2) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్లు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికి ఎన్టీఆర్ చేస్తున్న ‘వార్ 2’ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా మీద తెలుగులో పెద్దగా అంచనాలైతే లేవు.
Also Read: AM రత్నంని వాళ్లిద్దరూ అంత టార్చర్ పెట్టారా..? అందుకే నేడు పవన్ ప్రెస్ మీట్?
రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ (Cooli) సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉన్నప్పటికీ వీటిలో ఏది విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది… ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే వరుసగా ఎనిమిది విజయాలను సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.
లేకపోతే మాత్రం బాలీవుడ్ లో ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.మరి ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమా విజయాన్ని సాధిస్తుంది అంటూ అతని అభిమానులు సైతం భారీ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘నీ ఒడిలో తలవాల్చుకొని ఏడవాలని ఉంది’.. బ్రహ్మానందం మాటలకు నవ్వు ఆపుకోలేకపోయి పవన్
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తోంది… ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ (KGF) సినిమాలు గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టినవే కావడం విశేషం…