Social Media Influencers: ఆస్తమానం ఫేస్ బుక్ ఏం చూస్తావ్.. ఊరికే వాట్సప్ లో తల దూర్చుతావ్ ఎందుకు.. ఇన్ స్టా గ్రామ్ చూడడం తప్ప వేరే పని లేదా.. ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఏమొస్తుంది.. యూట్యూబ్లో అస్తమానం ఆ వీడియోలు చూస్తే ప్రయోజనం ఏముంది.. ఈ ప్రశ్నలను ఈ కాలపు పిల్లలు మాత్రమే కాదు.. ఒక వయసుకు వచ్చిన వారు కూడా ఎదుర్కొనే ఉంటారు. ఇప్పటికీ మన సమాజంలో సోషల్ మీడియా అంటే ఒక పనికిరాని వ్యవహారం. ఒక మాటలో చెప్పాలంటే గాలి కబుర్ల సమహారం. కానీ ఇప్పుడు అది వేలకోట్ల వ్యవస్థగా మారిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కాలంలో ఇన్ ఫ్లూ యన్సర్స్ కు సోషల్ మీడియానే బలమైన వరం. కాసులు కురిపించే యంత్రం.
Also Read: మూడు నెలల పాటు ప్రజలు ఇంట్లో మాత్రమే ఉండే ఈ గ్రామం గురించి తెలుసా?
వినే వాడికి చెప్పేవాడు లోకువ అంటారు. కానీ సోషల్ మీడియాకు ఈ నానుడి వర్తించదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చెప్పేవాడికి విలువ. వినే వాడికి విజ్ఞానం, వినోదం, కాలక్షేపం. అందుకే సోషల్ మీడియా అనేది కాసులు కురిపించే మంత్రంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభావశీలమైన వ్యక్తులకు అది కామ దేనువుగా మారిపోయింది. ఓ అంచనా ప్రకారం మన దేశంలో ఈ ఏడాది సోషల్ మీడియా ద్వారా ప్రభావశీలమైన వ్యక్తులు 3,400 కోట్ల వరకు సంపాదిస్తారట. ఇందులో కంటెంట్ క్రియేటర్లకు సింహభాగం వాటా ఉంటుందట. గ్లోబల్ మార్కెట్లో మార్పులు.. సోషల్ మీడియా వాడే విధానం మారిపోవడం వంటివి ప్రభావ శీలమైన వ్యక్తుల ఆదాయాలను ఘనంగా పెంచుతాయట. మనదేశంలో సోషల్ మీడియాలో పదిమంది వ్యక్తులు అత్యంత ప్రభావశీలమైన వారిగా ఉన్నారట.
టెక్నికల్ గురూజీ
ప్రభావశీలమైన వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో టెక్నికల్ గురూజీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వ్యక్తి కొనసాగుతున్నాడు. ఇతడి ఆస్తులు ఇప్పటికే 356 కోట్లకు చేరుకున్నాయి. టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానల్ ను 2.37 కోట్ల మంది అనుసరిస్తున్నారు.
భువన్ బాం
భువన్ బాం ఆస్తుల విలువ 122 కోట్లు.. ఇతడి యూట్యూబ్ ఛానల్ 2.66 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇతడు బాలీవుడ్ యాక్టర్ కూడా. మాటకారి.. హాస్య చతురత.. విషయ చతురతో ఉన్న వ్యక్తి కావడంతో అనతి కాలంలోనే గుర్తింపు సాధించాడు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా విడుదల సమయంలో ఆ చిత్ర యూనిట్ ను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించాడు.
బీర్ బైసిప్స్
ఈ ఛానల్ ను 82 లక్షల మంది అనుసరిస్తున్నారు.. వర్త మన అంశాల గురించి ఈ చానల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ
లు కూడా చేస్తారు. అందువల్లే ఈ ఛానల్ అనధికాలంలోనే గుర్తింపు సాధించింది. అన్నట్టు ఈ ఛానల్ నిర్వాహకుడి ఆస్తుల విలువ 60 కోట్ల వరకు ఉంటుంది.
అమిత్ బదనా
ఇతడు చానల్ ను 2.45 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇతడు బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ముఖ్యంగా హాస్య సన్నివేశాలను.. హాస్య చతురతతో కూడిన షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో ఇతడు దిట్ట. ఇతడి ఆస్తుల విలువ 53 కోట్లు.
Also Read: భారతీయ వలస జనాభా.. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 దేశాలు ఇవే..!
కారి మీనాటి
ఇతడు హిందీలో పేరుపొందిన ర్యాపర్.. నటుడు.. అన్నింటికీ మించి విశ్లేషకుడు. ఇతడి ఆస్తుల విలువ 50 కోట్ల వరకు ఉంటుంది. ఇతడి చానల్ ను ఏకంగా నాలుగు కోట్లకు పైగా వీక్షకులు అనుసరిస్తున్నారు.
నిషా మధులిక
ఈ గృహిణి యూట్యూబ్ ఛానల్ ను 1.49 కోట్ల వీక్షకులు అనుసరిస్తున్నారు. ఈమె ఆస్తుల విలువ 43 కోట్లు. కేవలం వంటల ద్వారానే ఈమె యూట్యూబ్లో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
సందీప్ మహేశ్వరి
ఈయన ఛానల్ ను 2.85 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇతడు మోటివేషనల్ స్పీకర్. ప్రతి విషయాన్ని ఉదాహరణతో చెప్పడం.. సమస్యకు పరిష్కారం చూపించడంలో ఇతడు దిట్ట. అందువల్లే ఈ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.
ఆశిష్ చెంచాలని
ఇతడి యూట్యూబ్ ఛానల్ ను మూడు కోట్ల మంది వీక్షకులు అనుసరిస్తున్నారు. పేరడి వీడియోలు తీయడంలో ఇతడు దిట్ట. ఇతని ఆస్తుల విలువ 40 కోట్ల వరకు ఉంటుంది.
గౌరవ్ తనేజా
ఇతడి ఛానల్ ను 93 లక్షల మంది అనుసరిస్తున్నారు. కుటుంబ వీడియోలను రూపొందించడంలో.. వర్తమాన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడంలో ఇతడు దిట్ట. అందువల్లే ఇతడికి ఈ స్థాయిలో గుర్తింపు లభించింది.
హర్ష్ బెనివాల్
ఇతడి ఆస్తుల విలువ 30 కోట్ల వరకు ఉంటుంది. ఇతడు ఛానల్ ను1.34 కోట్ల మంది అనుసరిస్తున్నారు. వర్తమాన వీడియోలను రూపొందించడంలో.. దానికి తగ్గట్టుగా విశ్లేషణ చేయడంలో ఇతడు తోపు. పైగా సాహస వీడియోలను రూపొందించడంలో ఇతడు ఆరి తేరిన వ్యక్తి. అందువల్లే ఇద్దరికి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తోంది.