https://oktelugu.com/

టీ అమ్మి కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి.. ఎలా అంటే..?

ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించాలంటే తెలివితేటలు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి టీ అమ్మి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎన్‌ఆర్‌ఐ జగదీశ్ కుమార్ టీ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. 2018 సంవత్సరం వరకు జగదీష్ న్యూజిలాండ్ లో హాస్పిటాలిటీ రంగంలో విధులు నిర్వహించేవారు. అయితే టీ బిజినెస్ చేయాలనే ఆలోచనతో అతను ఇండియాకు తిరిగొచ్చారు. భారత్ కు వచ్చిన తరువాత ఎన్ఆర్ఐ చాయ్‌వాలా పేరుతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 28, 2021 / 06:02 PM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించాలంటే తెలివితేటలు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి టీ అమ్మి కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎన్‌ఆర్‌ఐ జగదీశ్ కుమార్ టీ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. 2018 సంవత్సరం వరకు జగదీష్ న్యూజిలాండ్ లో హాస్పిటాలిటీ రంగంలో విధులు నిర్వహించేవారు. అయితే టీ బిజినెస్ చేయాలనే ఆలోచనతో అతను ఇండియాకు తిరిగొచ్చారు.

    భారత్ కు వచ్చిన తరువాత ఎన్ఆర్ఐ చాయ్‌వాలా పేరుతో టీ వ్యాపారం మొదలుపెట్టి వేర్వేరు ఫ్లేవర్స్‌ తో జగదీష్ కుమార్ టీ అమ్మడం మొదలుపెట్టారు. ఒక్కొక్క టీకు ఒక్కో పేరు పెట్టి ఆ టీలను ఎన్ఆర్ఐ చాయ్‌వాలా దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జగదీష్ కింద ఏకంగా 35 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని భారీగా రాబడిని ఆర్జిస్తున్నారు.

    మన దేశంలో టీ తాగేవారి సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. కొంతమంది రోజుకు నాలుగైదు సార్లు టీ తాగుతూ ఉంటారు. పొద్దున, సాయంత్రం టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎక్కువమంది ఉంటారు. టీ బిజినెస్ చిన్న బిజినెస్ అని అనిపించినా తెలివిగా చేస్తే ఈ బిజినెస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమేనని కొంతమంది ప్రూవ్ చేస్తున్నారు. వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లు జగదీష్ కుమార్ లా ప్రణాళికాబద్ధంగా చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

    ప్రస్తుతం జగదీష్ కుమార్ కంపెనీ టర్నోవర్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండగా రాబోయే రోజుల్లో టర్నోవర్ మరింత పెరుగుతుందని జగదీష్ కుమార్ భావిస్తున్నారు