https://oktelugu.com/

Electrical Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గనున్న ధరలు?

Electrical Vehicle: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ యుగం అన్నట్లుగా మారింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు సందడి చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు సులువుగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వం సైతం ప్రోత్సాహం అందిస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2024 / 03:57 PM IST

    Electric Scooter

    Follow us on

    Electrical Vehicle: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ యుగం అన్నట్లుగా మారింది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు సందడి చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు సులువుగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రభుత్వం సైతం ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటికే ఫేమ్ 2 ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ఈవీల ఉత్పత్తి సంస్థలకు అందించింది. ఇప్పుడు ఫేమ్ 3 ద్వారా మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    2024 మార్చి నెలతో ఫేమ్ 2 ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం ఎలక్షన్ కారణంగా ఫేమ్ 3 గురించిన నిర్ణయం నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకంపై 15 శాతం రాయితీ అందించింది. ఇప్పుడు ఫేమ్ 3ని అమలు చేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు వెచ్చించనుంది. ఫేమ్ 2 కింద వేల ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రాయితీ కల్పించింది. ఫేమ్ 3 కింద ఎలాంటి వాహనాలపై రాయితీ ఉంటుందోననేది తెలియాల్సి ఉంది.

    కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఫేమ్ 3లో ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. హైబ్రిడ్ కార్లపై సబ్సిడీ ఉంటుందని అంటున్నారు. ఈ తరుణంలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై రాయితీ ఇస్తారా? అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈఎంపీఎస్ కింద ఈవీ స్కూటర్ కొంటే రూ.10 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. త్రీ వీలర్ పై రూ.50 వేల వరకు రాయితీని పొందవచ్చు. మరి కొత్త ప్రభుత్వం ఈ వెహికల్స్ రాయితీ ఎలా ఉంటుందో చూడాలి.