Homeబిజినెస్IT Crisis: మళ్లీ ఐటీ సంక్షోభం.. ఉద్యోగుల కోత పెడుతున్న కంపెనీలు! ఏం జరుగనుంది?

IT Crisis: మళ్లీ ఐటీ సంక్షోభం.. ఉద్యోగుల కోత పెడుతున్న కంపెనీలు! ఏం జరుగనుంది?

IT Crisis: ఐటీ పరిశ్రమ మళ్లీ సంక్షోభం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆర్థిక మాంద్యం భయాలు.. ఖర్చులు నియంత్రణ లేకుండా పెరగడం.. ఉద్యోగులు కంపెనీలకు వస్తుండడం తదితర కారణాలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.

దిగ్గజ కంపెనీలు..
ఆర్థిక మాంద్యం కారణంగా గూగుల్‌, ఫ్లిప్‌కార్ట్‌, యూనిటీ సాఫ్ట్‌వేర్‌, పేటీఎం, అమెజాన్‌ తదితర ఐటీ, ఈ-కామర్స్‌ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించాయి. ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ చేరాయి.

మూడో త్రైమాసికంలో..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) టీ సీ ఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. టీసీఎస్‌ సంస్థ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫోసిస్ 6,101 మందికి ఉద్వాసన పలికింది.

టీసీఎస్‌ ఇలా..

అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఉద్యోగ కోతలు: 5,680

అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య వలసల రేటు: 13.3 శాతం

డిసెంబర్‌ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 6,03,305

ఇన్ఫోసిస్‌ ఇలా..

అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఉద్యోగ కోతలు: 6,101

అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య వలసల రేటు: 12.9 శాతం

డిసెంబర్‌ 31నాటికి సంస్థలో మిగిలిన ఉద్యోగులు: 3,22,663

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version