10 Rupees Coin : 10 రూపాయల నాణెం చెల్లుతుందా? లేదా? అపోహలపై ఆర్బీఐ కీలక సమావేశం..

పాత కరెన్నీ రద్దు తరువాత దాదాపు మూడేళ్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి దీనిని 2005లోనే తయారు చేశారు. రూ. 10 నోట్ల ముద్రణ ఖర్చు కంటే నాణెం ఖర్చు తక్కువగా ఉండడంంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2009 నుంచి 2017 సంవత్సరాల మధ్య మొత్తం 14 సార్లు రూ.10 నాణెలు విడుదలయ్యాయి. అయితే దేశంలో చాల చోట్ల రూ.10 నాణెల నిల్వలు పేరుకుపోయాయి.

Written By: Srinivas, Updated On : August 7, 2024 7:32 pm
Follow us on

10 Rupees Coin : దేశంలో కరెన్సీ నోట్ల హవా రోజురోజుకు తగ్గిపోతోంది. 2016లో మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపట్టిన తరువాత చాలా మంది కాగితపు కరెన్సీని చేతిలో ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు. అవసరాలకు దగ్గర ఉంచుకొని మిగతా మొత్తం బ్యాంకుల్లో లేదా ఇతర రకాల పెట్టుబడుల్లో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నోట్ల రద్దు తరువాత కొన్ని రకాల కొత్త నోట్లు వచ్చాయి. వీటిలో రూ. 2 వేల నోట్లు తిరిగి రద్దయ్యాయి. అయితే కాగితపు కరెన్సీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో కొన్ని నాణేలను కూడా అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ. 10 కాయిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రూ. 10 కాయిన్ మార్కెట్ లో చెల్లుతుందని అధికారికంగా ఆర్బీఐ ప్రకటించినా కొందరు పట్టించుకోవడం లేదు. రూ. 10 కాయిన్ ను చూడాగానే భయపడిపోతున్నారు. కొందరు వర్తకులు దీనిని తీసుకోవడం లేదు. దీంతో వినియోగదారులు సైతం రూ. 10 కాయిన్ ను ఎక్కడైనా ఇస్తే వద్దంటున్నారు. కొన్ని సార్లు దీనిపై గొడవలు కూడా జరిగాయి. దీంతో అసలు రూ. 10 కాయిన్ చెల్లుతుందా? లేదా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరిన్ని సమస్యలు వస్తాయని భావించిన ఆర్బీఐ వెంటనే కీలక సమావేశం నిర్వహించింది. ప్రధానంగా రూ. 10 కాయిన్ మారకంపై చర్చలు జరుపుతోంది. అయితే ఈ సమావేశాల్లో ఏం తేల్చారంటే?

పాత కరెన్నీ రద్దు తరువాత దాదాపు మూడేళ్లకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి దీనిని 2005లోనే తయారు చేశారు. రూ. 10 నోట్ల ముద్రణ ఖర్చు కంటే నాణెం ఖర్చు తక్కువగా ఉండడంంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2009 నుంచి 2017 సంవత్సరాల మధ్య మొత్తం 14 సార్లు రూ.10 నాణెలు విడుదలయ్యాయి. అయితే దేశంలో చాల చోట్ల రూ.10 నాణెల నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల విజయవాడకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ రూ. 10 నాణెంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అయితే ప్రస్తుతం కరెన్సీ వాడకం తగ్గిపోయింది. అంతా ఆన్ లైన్ లోనే మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. దీంతో రూ. 10 అవసరం ఉన్నా ఫోన్ పే ద్వారా పంపుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.10 కాయిన్ చెలామణి తక్కువ అయింది. ఇలా కొన్ని చోట్ల రూ. 10 కాయిన్ నిల్వలు ఉండడంతో ఎక్కువగా చెలామణి లేకుండా పోయింది. ఈ క్రమంలో మార్కెట్లో ఎక్కువగా ఈ నాణెం కనిపించకపోవడంతో అసలు రూ. 10 నాణం చెలామణిలో ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయాన్ని గ్రహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా కొందరు బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ చిరిగిన నోట్లతో పాటు రూ.10 నాణెలనుకూడా స్టోర్ చేయాల్సి వస్తోందని అన్నారు. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చూస్తోంది. ఎవరైనా రూ. 10 నాణెం తీసుకోను అని అంటేచర్యలు తీసుకోవాలనే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. గతంలోనూ రూ. 10 నాణెంపై అనిశ్చితి నెలకొంది. కానీ ఆ తరువాత రూ.10 నోట్ల రాక తగ్గడంతో చాలా మంది నాణెలను ఉపయోగించారు. కానీ ఇప్పుుడు మరోసారి ఇవి మార్కెట్లోకి ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.