పిల్లల పేరుతో పాలసీలు తీసుకుంటే లాభమా..? నష్టమా..?

చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలసీలను తీసుకుంటున్నారు. అయితే పిల్లల పేరుతో పాలసీ తీసుకుంటే మంచిదా..? కాదా..? అనే ప్రశ్నకు నిపుణులు పిల్లల పేర్లపై తీసుకున్న పాలసీలు చాలా సందర్భాల్లో పెద్దగా ప్రయోజనం చేకూర్చవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్లలో పిల్లల పేర్లపై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరు బీమా ఏజెంట్లు చెప్పే పాలసీలలో పెట్టుబడులు పెట్టినా ఆ పాలసీల వల్ల పన్ను […]

Written By: Navya, Updated On : January 30, 2021 7:26 pm
Follow us on

చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాలసీలను తీసుకుంటున్నారు. అయితే పిల్లల పేరుతో పాలసీ తీసుకుంటే మంచిదా..? కాదా..? అనే ప్రశ్నకు నిపుణులు పిల్లల పేర్లపై తీసుకున్న పాలసీలు చాలా సందర్భాల్లో పెద్దగా ప్రయోజనం చేకూర్చవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్లలో పిల్లల పేర్లపై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే కొందరు బీమా ఏజెంట్లు చెప్పే పాలసీలలో పెట్టుబడులు పెట్టినా ఆ పాలసీల వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు, అదనపు రాబడి పొందే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. టర్మ్ జీవిత బీమా లాంటి పాలసీలు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఇలాంటి పాలసీ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని పిల్లల పేర్లపై ఇలాంటి పాలసీ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో డిపాజిట్ చేసే అవకాశం ఉన్నా కొడుకు, కూతురు పేర్లతో రెండు ఖాతాలు తెరిస్తే గరిష్టంగా సంవత్సరానికి లక్షన్నర రూపాయలు మాత్రమే డిపాజిట్ చేసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన స్కీమ్ అని చెప్పవచ్చు. అయితే ఆడపిల్లల పేరుపై మాత్రమే ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ లో పెట్టిన పెట్టుబడులకు 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మైనర్ పిల్లల పేర్లపై వచ్చే ఆదాయాన్ని బట్టి తల్లిదండ్రులలో ఎవరికి ఎక్కువ సంపాదన ఉందో వారు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పిల్లల పేర్లతో పాలసీ తీసుకోవడం కంటే కుటుంబ పెద్ద టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.