https://oktelugu.com/

‘రాథేశ్వామ్’ కూడా రిలీజ్ కి సిద్ధం !

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల రిలీజ్ డేట్ లు అన్ని ఒక్కోటి బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ ‘రాథేశ్వామ్’ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో రాధేశ్వామ్ సినిమా వ్యవహారం పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ డేట్ ను చూసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం మూడు డేట్ల ను చిత్రబృందం పరిశీలిస్తోందని.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 01:14 PM IST
    Follow us on


    తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల రిలీజ్ డేట్ లు అన్ని ఒక్కోటి బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ ‘రాథేశ్వామ్’ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో రాధేశ్వామ్ సినిమా వ్యవహారం పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి, బాలీవుడ్ లోనూ డేట్ ను చూసుకోవాలి. అందుకే ప్రస్తుతం ఈ సినిమా కోసం మూడు డేట్ల ను చిత్రబృందం పరిశీలిస్తోందని.. ఈ మూడింటిలో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: ప్రదీప్ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ !

    ఇక నేషనల్ స్టార్ ప్రభాస్ తన ‘రాధే శ్యామ్’ కోసం ఇప్పటికే ఫుల్ డేట్స్ కేటాయించి సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేశాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే ప్రభాస్ లుక్ కూడా లాంగ్ హెయిర్ తో పాటు హెవీ ఎమోషనల్ ఆర్ఆర్ తో సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే కాంబినేషన్ అనేది.. ఈ సినిమా మార్కెట్ కి పెద్ద సమస్యగా మారిందట. ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చాలా కీలకం.. ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పటికే బయ్యర్లు భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

    Also Read: 20 నిమిషాలకి ఆ హీరోయిన్ కు కోటి రూపాయలు !

    మొత్తానికి ఏ మాత్రం హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్.. పాన్ ఇండియా మూవీ అయినా, దాదాపు ఈ సినిమా కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నా.. సినిమా పై మాత్రం హైప్ రావడం లేదు. కారణం… రాధా కృష్ణకు పెద్దగా హిట్ ట్రాక్ లేకపోవడమే. మరి గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చివరకు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్