https://oktelugu.com/

ప్రదీప్ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ !

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా కరోనా వల్ల ఎన్నో ఆటంకాలను ఎదురుకుని మొత్తానికి నిన్న విడుదల అయింది. ఇక ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ మిశ్రమ స్పందన రావడం, పైగా సినిమా థియేటర్స్ కూడా మెయిన్ వి పడకపోవడంతో అది పెద్ద మైనస్ అయిందనుకున్నారు. ఎలాగూ సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్ కొంత సాగదీతగా, సెకెండాఫ్ బోరింగ్ గా సాగిందనే టాక్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 01:01 PM IST
    Follow us on


    ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా కరోనా వల్ల ఎన్నో ఆటంకాలను ఎదురుకుని మొత్తానికి నిన్న విడుదల అయింది. ఇక ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ మిశ్రమ స్పందన రావడం, పైగా సినిమా థియేటర్స్ కూడా మెయిన్ వి పడకపోవడంతో అది పెద్ద మైనస్ అయిందనుకున్నారు. ఎలాగూ సినిమా విషయానికి వస్తే ఫస్టాఫ్ కొంత సాగదీతగా, సెకెండాఫ్ బోరింగ్ గా సాగిందనే టాక్ వచ్చింది. అయితే, మొదటి రోజు ఊహించని విధంగా ఈ సినిమాకు రూ. కోటికి పైగానే షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

    Also Read: 20 నిమిషాలకి ఆ హీరోయిన్ కు కోటి రూపాయలు !

    కాగా ముందుగా ప్రాంతాల వారిగా చూసుకుంటే
    నైజాం – రూ. 40 లక్షలు,
    సీడెడ్ – రూ. 40 లక్షలు,
    గుంటూరు – రూ. 20 లక్షలు,
    గోదావరి జిల్లాల్లో – రూ. 20 లక్షలు వరకూ కలెక్ట్ చేసినట్లు సమాచారం.

    ఈ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ అవుతున్నారు. నూతన దర్శకుడు మున్నా ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా ఇప్పటికే వచ్చిన కథను ఎమోషనల్ గా చెప్పడానికి ప్రయత్నం చేసాడు. హీరోగా ప్రదీప్ కి మొదటి సినిమా అయినప్పటికీ అతని లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. అమ్మను అమ్మాయిలని ఇష్టపడని సరదాగా తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.

    Also Read: సంక్రాంతి సెంటిమెంట్ వదలనంటున్న మహేష్

    ‌అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతా అయ్య‌ర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ ఫాదర్ గా నటించిన పోసాని కూడా తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్