Plot Purchase: ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. చాలా మంది ఓ స్థలం కొనుక్కొని అందులో ఇల్లు నిర్మించుకోవాలని చూస్తారు. కానీ పట్టణాలు, నగరాల్లో సరైన ల్యాండ్ దొరకకపోవడంతో అపార్టుమెంట్లల్లో ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. ఒకే స్థలంలో కొన్ని ప్లాట్లను నిర్మించి ఆయా రేట్లకు విక్రయంచే వీటిని ఎక్కువగా ఉద్యోగులు కొనుగోలు చేస్తుంటారు. ఇల్లు నిర్మించడానికి అనువైన సమయం లేకపోవడంతో పాటు శ్రమను తగ్గించుకోవడానికి అపార్టమెంట్ ను కొనుగోలు చేస్తుంటారు. అయితే కొందరు డబ్బులు అదనంగా ఉన్నవారు అపార్టమెంట్ లో ప్లాట్ కొని ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల లాభమా? నష్టమా?
పెట్టుబడి రంగంలో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందింది. స్థలాలపై పెట్టుబడి పెట్టిన వాళ్లు 5 నుంచి 10 రేట్ల వరకు లాభాలు పొందారు. అయితే ఉద్యోగం చేస్తున్న ప్రదేశానికి దగ్గర్లో స్థలాలు లేకపోవడంతో పాటు మంచి వాతావరణంలో స్థలాలు కావాలంటే ఇప్పట్లో దొరకడం కష్టతరంగా మారింది. దీంతో అపార్టుమెంట్ లోని ప్లాట్ కొనాలని చూస్తున్నారు. అసలే ఇల్లు లేనివారికి ఇది ఉపయోగకరమే. కానీ అప్పటికే ఇల్లు ఉండి కేవలం ప్లాట్ పై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం ఇది నష్టమేనని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే అపార్టుమెంట్ లోని ప్లాన్ ను ఒక్కసారి కొనుగోలు చేసిన తరువాత దాని విలువ రోజురోజుకు పడిపోతుంది. అంతేకాకుండా ఒక ప్లాట్ కొనుగోలు చేస్తేంది. అందులో 30 శాతం స్థలంపై 70 శాతం నిర్మాణంపై వెచ్చించాల్సి ఉంటుంది. ఒక అపార్టుమెంట్ లో ప్లాట్ కొన్న వారికి వచ్చే స్థలం చాలా తక్కువ. స్థలంపై పెట్టుబడి పెడితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అపార్టమెంట్ లో ఉండే స్థలానికి వచ్చే రిటర్న్స్ చాల తక్కువ. పైగా ఇంటి నిర్మాణం విలువ రోజురోజుకు తగ్గిపోతుండడంతో ప్లాట్ విలువ పడిపోతుంది. మొత్తంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది నష్టమే.
ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇండివిజల్ ల్యాండ్ ను కొనుగోలు చేయడం బెటర్. దీనిపై కచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. పైగా ఇల్లు కొనేవారికంటే స్థలం కొనేవారు ఎక్కువగా ఉంటారు. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో, ఇల్లు లేని వారికి అపార్టుమెంట్ ప్లాట్ కొనుగోలు చేయడం మంచిదే. కానీ పెట్టుబడి పెట్టాలనుకువారికి ఇది నష్టమే తెస్తుంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.