https://oktelugu.com/

కారులోన్ మధ్యలోనే క్లోజ్ చేస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి..

కారు లోన్ మధ్యలోనే క్లోజ్ చేయాలనుకునే వారు ముందుగా బ్యాంకు ప్రతినిధులను సంప్రదించాలి. ఎందుకంటే ఫ్రీ క్లోజ్ చేయడం ద్వారా పూర్తి వడ్డీ చెల్లించకుండా కొంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 19, 2024 / 12:17 PM IST

    car loan rules

    Follow us on

    కారు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరైన బడ్జెట్ అందరి వద్ద ఉండదు. ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం ద్వారా కారు కొనుక్కునే అవకాశం ఉంటుంది. లోన్ ద్వారా కారు కొనుగోలు చేయడం ద్వారా మొత్తం బడ్జెట్ చెల్లించకుండా నెలనెలా వాయిదాల రూపంలో చెల్లిస్తూ కారులో తిరిగేయవచ్చు. దీంతో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇలా లోన్ ద్వారా కారు కొనుక్కుంటారు. అయితే ఒక్కోసారి ఇలా వాయిదాలు చెల్లిస్తుండా మధ్యలో వివిధ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుతో లోన్ మొత్తం తీర్చాలనుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు పరిశీలించాలి. అవేంటంటే?

    కారు లోన్ మధ్యలోనే క్లోజ్ చేయాలనుకునే వారు ముందుగా బ్యాంకు ప్రతినిధులను సంప్రదించాలి. ఎందుకంటే ఫ్రీ క్లోజ్ చేయడం ద్వారా పూర్తి వడ్డీ చెల్లించకుండా కొంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అది లోన్ విధానాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ఆ ఫైన్ ఎక్కువ అనిపిస్తే నెలనెల వాయిదాల రూపంలో చెల్లంచమే బెటర్.

    కనీసం 12 నెలల పాటు వాయిదాలు చెల్లించిన తరువాతే లోన్ ఫ్రీక్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల లోన్ తీసుకున్న తరువాత సంవత్సరం పాటు ఆగాల్సిందే. ముందుగా క్లోజ్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

    కారు రుణం ఒకేసారి తీర్చడం ద్వారా ఇతర ఆర్థిక అవసరాలు తీరుతాయో లేదో చూసుకోండి. లేదంటే మిగతా వాటి కోసం మళ్లీ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారు లోన్ కంటే మిగతా ఖర్చులు అనవసరం అనిపిస్తేనే వీటిని క్లోజ్ చేయాలి.

    బ్యాంకు వడ్డీ రేట్లు రోజురోజుకు మారుతూ ఉంటాయి. అయితే కారు లోన్ ను రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒక లోన్ తీసుకునేటప్పుుడు ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించేలా నిర్ణయించుకోవచ్చు. లేదా భవిష్యత్ లో మార్కెట్లో వడ్డీరేట్లు ఎలా ఉంటే అలా చెల్లించేవిధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. మార్కెట్ల పరిస్థితులను భట్టి వడ్డీరేట్లు చెల్లిస్తానని లోన్ తీసుకుంటే మాత్రం అప్పటి వడ్డీ రేట్ కు అనుగుణంగా చెల్లించాలి.

    కారు లోన్ ను మధ్య మధ్యలో అదనంగా రూ.5000 లేదా రూ.10,000 చెల్లిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల లోన్ భారం తగ్గుతుంది. కారు రుణాన్ని తొందరగా క్లోజ్ చేయడం మంచిదే. కానీ ముందుగా రుణ దాతకు ఈ విషయాన్ని చెప్పడం మంచిది.