https://oktelugu.com/

బ్యాంకు ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. ఈ మెసేజ్ లు ఓపెన్ చేయొద్దు..

చాలా మందికి ఎస్బీఐ తో మొబైల్ లింక్ అయి ఉంది. కొన్ని ఫైనాన్స్ వ్యవహారాలన్నీ మొబైల్ తోనే నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులు మొబైల్ నెంబర్లు తెలుసుకొని వాటికి కొన్ని మెసేజ్ లు పంపిస్తూ ఉంటారు. గతంలోకొన్ని కాల్స్ చేసిన ఓటీపీ, బ్యాంకు అకౌంట్ నెంబర్ తెలుసుకునేవారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 19, 2024 / 12:20 PM IST

    SBI YONO App

    Follow us on

    భారత్ లో బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా. ఎస్బీఐ నుంచి నిత్యం కోట్ల రూపాయల ట్రన్జాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఖాతాలను చోరీ చేస్తూంటారు. మాయమాటలు, కొన్ని మెసేజ్ లు పంపి డబ్బును కొట్టేస్తుంటారు. ఈ నేరాగాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి బ్యాంకు పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయినా కొందరు నేరగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో ఎస్బీఐ ఖాతాదారులను మోసం చేస్తూనే ఉన్నారు. లేటేస్టుగా కొత్త తరహాలో మోసం చేస్తున్నట్లు బ్యాంకు గుర్తించింది. అదేంటంటే?

    చాలా మందికి ఎస్బీఐ తో మొబైల్ లింక్ అయి ఉంది. కొన్ని ఫైనాన్స్ వ్యవహారాలన్నీ మొబైల్ తోనే నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాదారులు మొబైల్ నెంబర్లు తెలుసుకొని వాటికి కొన్ని మెసేజ్ లు పంపిస్తూ ఉంటారు. గతంలోకొన్ని కాల్స్ చేసిన ఓటీపీ, బ్యాంకు అకౌంట్ నెంబర్ తెలుసుకునేవారు. ఆ తరువాత కొన్ని టెక్స్ మెసెజ్ పంపించి వాటిని ఓపెస్ చేయాలని చెప్పేవారు. దీంతోచాలా మంది అలా ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు.

    కొత్తగా apk పేరిట కొన్ని మెసేజ్ లు వస్తున్నట్లు బ్యాంకు గుర్తించింది. ఇలా కొందరు మెసేజ్ పంపించి.. మీకు బ్యాంకు రివార్డు పంపించిందని, వాటిని ఓపెన్ చేయడం ద్వారా బ్యాంకులో యాడ్ అవుతాయని కొందరు చెబుతున్నారు. అయితే అలాంటి మెసేజ్ లు ఓపెన్ చేయొద్దని బ్యాంకు ఖాతాదారులకు యాజమాన్యం హెచ్చరిస్తోంది. బ్యాంకు నుంచి ఎలాంటి రివార్డులు ఇవ్వాల్సి వస్తే అధికారికంగా తెలియజేస్తమని తెలిపారు. అందువల్ల ఈ మెసేజ్ లు ఓపెన్ చేయొద్దని సూచించింది.