Anil Ambani Net Worth: మొన్ననే కదా చెప్పుకున్నాం కదా ముకేశ్ అంబానీ తన నమ్మినబంటుకు ఏకంగా ₹1500 కోట్ల విలువ చేస్తే భవంతిని కొనుగోలు చేసి ఇచ్చాడని.. కానీ ఇదే సమయంలో ఆశ్చర్యంగా అనిపించింది తన తమ్ముడు అనిల్ అంబానీ సున్నా కు పడిపోవడం.. నిజంగా కార్పొరేట్ ప్రపంచంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి. అందుకు అనిల్ అంబానీ జీవితమే ఒక ప్రబల ఉదాహరణ. అనిల్ అంబానీ ఒకప్పుడు ఆసియాలోనే ధనవంతుల జాబితాలో ఒకరిగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.
నిజంగా పడిపోయిందా?
అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్డమ్ లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ సున్నా అని కోర్టుకు వెల్లడించాడు. అనిల్ అంబానీ గ్రూప్ కి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందూజా గ్రూప్ అత్యధిక బిడ్డర్ గా నిలిచింది. దివాలా తీసిన కంపెనీని రూ. 9,650 కోట్ల ఖర్చుతో కొనుగోలుకు ఆఫర్ చేసింది. వాస్తవానికి ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ఉన్న అనిల్ అంబానీ ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరిగా ఉండేవారు.. 2020లో అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్డమ్ లోని కోర్టుకు హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. వాస్తవ నివేదికల ప్రకారం అనిల్ అంబానీ ఆస్తులు 13.7 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.. ఇది భారత కరెన్సీ 1.12 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
చరాస్తులు కూడా ఉన్నాయి
అనిల్ అంబాని తన ఆస్తులు సున్నా అని ప్రకటించినప్పటికీ ముంబైలో ఆయనకు 17 అంతస్తుల భవంతి ఉంది. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అయితే ఆయన నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ ప్రస్తుత ఆస్తుల విలువ భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు అనిల్ అంబానీ అడాగ్ పేరుతో పలు కంపెనీలు ఏర్పాటు చేశాడు. అయితే వాటిల్లో ఎక్కువ శాతం కంపెనీలు అప్పటి ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ఇలాంటి సమయంలో ఆ కంపెనీలకు ఆర్థికంగా దన్ను కల్పించే చర్యలు అనిల్ చేపట్టకపోవడంతో నష్టాలు పలకరించాయి. దీనికి తోడు ముఖేష్ అంబానీ వ్యాపార పరంగా కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించడంతో ఆయన అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. కానీ ఇదే సమయంలో అనిల్ అంబానీ తన కంపెనీలను అమ్ముకున్నారు..
పెరిగిపోయిన అప్పులు తీర్చేందుకు అనిల్ అంబానీ తన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలను అమ్మకానికి పెట్టాడు. వాటిని హిందూజా గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే అనిల్ అంబానికి అప్పులు ఇచ్చిన సంస్థలు ఒత్తిడి తీసుకురావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. కంపెనీలు మొత్తం అప్పిలేట్ ట్రిబ్యూనల్ కు వెళితే.. వాటాలు ఉపసంహరించుకొని అప్పులు చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో…అనిల్ అంబానీ తన కంపెనీలను అమ్మకానికి పెట్టాడు. అందులో భాగంగానే హిందూజా గ్రూప్ ఎక్కువకు కోట్ చేసి రిలయన్స్ క్యాపిటల్, ఎంటర్ టైన్ మెంట్ ను సొంతం చేసుకుంది. దీంతో అనిల్ తాను సున్నాకు పడిపోయానని కోర్టుకి చెప్పాల్సి వచ్చింది.