Priyanka Chopra: బాత్రూం కూర్చొని అన్నం తినేదానిని అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన హీరోయిన్ ప్రియాంక చోప్రా

అమెరికా కి చదువుకోవడానికి వచ్చిన కొత్తల్లో ఎంత ఇబ్బందులకు గురైందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ' అమెరికా లో స్కూలింగ్ చేస్తున్న సమయం లో నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను,అప్పట్లో నాకు ఎవరితో స్నేహం చెయ్యాలి అనేది అర్థం అయ్యేది కాదు, క్యాంటిన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలిసేది కాదు, వెడ్డింగ్ మెషిన్ నుండి స్నాక్స్ తీసుకొని ఎవరికీ కనపడకుండా బాత్రూం లోకి వెళ్లి తినే దానిని, ఆ తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్లేదానిని. అలా చాలా రోజుల పాటు చేశాను, నాలో ఉన్న భయం వల్ల అలా చెయ్యాల్సి వచ్చింది

Written By: Vicky, Updated On : April 29, 2023 5:01 pm
Follow us on

Priyanka Chopra: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు హాలీవుడ్ లో ఫుల్ బిజీ స్టార్ గా గడుపుతున్న నటి ప్రియాంక చోప్రా. ఒక స్టార్ హీరో కి ఎంత క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంటుందో, ఈమె చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా అంతే కెపాసిటీ ఉంటుంది. బాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి, కేవలం హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా,కథకి తగ్గట్టుగా తన పాత్రలో బలం ఉంది అనిపిస్తే క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఈమె ఏమాత్రం తడపడదు.

అందుకే ఆమెకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న తర్వాత ఈమెకి హాలీవుడ్ లో కూడా నటించే ఛాన్స్ దక్కింది.అక్కడ పలు సిరీస్ లలో మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈమె, బే వాచ్ అనే సినిమాలో విలన్ గా కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన మరో హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ అమెజాన్ ప్రైమ్ లో ఈమధ్యనే స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది.

ఇది ఇలా ఉండగా ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అమెరికా కి చదువుకోవడానికి వచ్చిన కొత్తల్లో ఎంత ఇబ్బందులకు గురైందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ అమెరికా లో స్కూలింగ్ చేస్తున్న సమయం లో నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను,అప్పట్లో నాకు ఎవరితో స్నేహం చెయ్యాలి అనేది అర్థం అయ్యేది కాదు, క్యాంటిన్ కి వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలిసేది కాదు, వెడ్డింగ్ మెషిన్ నుండి స్నాక్స్ తీసుకొని ఎవరికీ కనపడకుండా బాత్రూం లోకి వెళ్లి తినే దానిని, ఆ తర్వాత క్లాస్ రూమ్ కి వెళ్లేదానిని. అలా చాలా రోజుల పాటు చేశాను, నాలో ఉన్న భయం వల్ల అలా చెయ్యాల్సి వచ్చింది, ఆ తర్వాత నాలుగు వారాల పాటు అక్కడ జరుగుతున్నవి గమనించి నాలో ధైర్యం పెరిగింది. స్కూల్ లో ఉన్న తోటి స్టూడెంట్స్ తో స్నేహం చెయ్యడానికి నన్ను నేను చాలా మార్చుకున్నాను. అక్కడ డేటింగ్ చెయ్యడం , లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం వంటివి చాలా కామన్, అలాంటివి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని అర్థం అయ్యేట్టు నా స్నేహితులకు చెప్పేదానిని’ అంటూ ప్రియాంక చోప్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.