IQOO Z10: కొత్త స్మార్ట్ ఫోన్ కోసం యూత్ ఈగర్ గా వేయిట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు అందరినీ ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తాజాగా iQOO కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Z10 పేరుతో ఉన్న ఈ మొబైల్ లో ప్రధానంగా బ్యాటరీకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే ఇందులో 7300mAhతో కలిగిన భారీ బ్యాటరీ ఉండనుంది. బ్యాటరీ సమస్యతో బాధపడేవారు ఈ మొబైల్ చాలా వరకు ఉపయోగపడుతుందని కంపెనీ తెలుపుతోంది. ఈ మొబైల్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల వరకు వస్తుందని అంటున్నారు. ఏప్రిల్ 16న మార్కెట్లోకి వచ్చిన ఈ మొబైల్ లో ఇంకా ఎలాంటి పీచర్లు ఉన్నాయంటే?
Also Read: కష్టాలు రాకుండా ఉండాలంటే.. విదురనీతి ఏం చెబుతుందంటే?
భారత్ లో రిలీజ్ అయిన ఐకూ z10 స్మార్ట్ ఫోన్ లో అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందలు 8 GB RAM, 128 GB Storage కలిగి ఉంది. అలాగే ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ కూడా ఉందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.21,999.. అలాగే రెండో మొబైల్ రూ.25,999 గా ఉంది. అయితే వివిధ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. ఈ డిస్కౌంట్ రూ.2,000 గా ఉండనుంది. అలాగే ఈ మొబైల్ కొనుగోలు చేయడం వల్ల యూఎస్ బీ కేబుల్ తో పాటు ప్రొటెక్టివ్ ఫిల్మ్, చార్జర్, ఫోన్ కేస్ కూడా వస్తాయి.
ఈ మొబైల్ 120 Hz డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇది 6.77 అంగుళాలతో కూడుకొని FHD+తో ఉండనుంది. అలాగే ఇది 5000 నిట్స్ గరిష్ట తేజస్సును కలిగి ఉంటుంది. అంటే సన్ లైట్ లోనూ ఈ మొబైల్ ను బ్రైట్ నెస్ తో చూడొచ్చు. అంతేకాకుండా చాలా కాలం పాటు ఈ మొబైల్ మన్నికగా ఉండేందుకు దీనికి మిలిటరీ MIL STD 810Hను అమర్చారు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ప్రాసెస్ ను కలిగి ఉంది. ఇది డ్రాగన్ 7s Zn 2 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 12 GB ర్యామ్ , 256 స్టోరేజీని కలిగి ఉంది. ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి 2 సంవత్సరాల వరకు OSఅప్ డేట్స్ చేస్తామని చెబుతున్నారు. ఇంకా ఇందులో AI ఫీచర్స్ అదనంగా ఉన్నట్లు కంపెనీ తెలుపుతోంది.
ఇక మొబైల్ లో ప్రధానంగా చూసేది కెమెరా గురించే. ఐకూ z10 స్మార్ట్ ఫోన్ లో డ్యూయెల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 1.8 అపేచర్, OIS సపోర్టుతో 50 మెగా పిక్సల్ తో IMX882 కెమెరాను కలిగి ఉంది. అలాగే సెల్పీ కోసం 32 మెగా ఫిక్స్ ల్ తో పనిచేయనుంది. అలాగే ఇందులో 5జీ, 4జీ కనెక్టివిటీ, వైపై, జీపీఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కలర్ టెంపరేచర్ తో పాటు యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.