Shweta Tiwari’s daughter : ప్రస్తుతం ఈమె సినిమాలలో వరుసగా అవకాశాలను అందుకుంటుంది. తాజాగా శ్వేతా తివారి కూతురు రాంప్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెర మీద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఏకైక నటి శ్వేతా తివారి. హిందీలో బాగా పాపులర్ అయిన సీరియల్ కసౌటి జిందగీకే సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది శ్వేతా తివారి. ఈ సీరియల్ తో ప్రేక్షకులలో ఎక్కువ ఆదరణ లభించింది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శ్వేతా తివారి. దాదాపుగా బుల్లితెర మీద ఈ సీరియల్ ఏడేళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్లో ప్రేరణ శర్మ పాత్రకు ప్రేక్షకులలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బుల్లితెర మీద ప్రసారం అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా శ్వేతా తివారి పాల్గొని విజేతగా నిలిచింది.
Also Read : అప్పట్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు.. ఇప్పుడు కేవలం 3 నిమిషాల పాటకు కోట్లలో పారితోషకం..
ఆ తర్వాత పలు సీరియల్స్ లో అలాగే టీవీ షోలో ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కానీ ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది అని చెప్పొచ్చు. రెండుసార్లు శ్వేతా తివారి ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. 1998లో శ్వేత నటుడు రాజా చౌదరిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు పాలక్ తివారి అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ 2007లో విడాకులు తీసుకుని విడిపోయారు. కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న తర్వాత మళ్లీ 2013లో అభినవ్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్వేత. ఈ దంపతులకు రేయాన్సీ కోహ్లీ పుట్టాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
ప్రస్తుతం నటి శ్వేతా తివారి తన కూతురు మరియు కొడుకుతో కలిసి ఒంటరిగా జీవితం గడుపుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ తో బిజీ బిజీగా గడుపుతుంది. రీసెంట్ గా శ్వేతా తివారి కూతురు పాలక్ తివారి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతున్న ది బూత్ ని చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు సిద్ధాంత సచ్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా పాలక్ తివారి ఒక ఫ్యాషన్ వేడుకలో రాంప్ వాక్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి.