iPhone under 40000: భారతదేశంలో Apple ఫోన్లకు విశేషమైన ఆదరణ ఉంది. కొత్తగా iphone మార్కెట్లోకి వచ్చిందంటే ఎగబడి మరీ కొంటారు. అయితే కొందరు ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలని అనుకున్నా.. ధర ఎక్కువగా ఉండడంతో వెనుకడుగు వేస్తారు. ఇలాంటి వారి కోసం ఆపిల్ కంపెనీ ఒక్కోసారి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా విజయ్ సేల్స్ లో ఆపిల్ ఐఫోన్ పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ మొబైల్లో రూ. 40,000 లోపే దక్కించుకునే ఛాన్స్ వచ్చింది. ఐఫోన్ కొనాలని అనుకునేవారు… ఈ కోరిక తీర్చుకోవాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని కొందరు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ తగ్గింపుతో వచ్చే ఆ మొబైల్ ఏది? అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
ఆపిల్ కంపెనీకి చెందిన iphone రకరకాల సిరీస్ లతో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 15 సిరీస్ ఫోన్ ధర రూ.54,900 తో విక్రయిస్తున్నారు. అయితే దీనిపై ఎనిమిది శాతం తగ్గింపుతో అందిస్తున్నారు. బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా వీటిని కొనుగోలు చేస్తే మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 15 కొనాలని అనుకునేవారు HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు పై ఆరు నెలల ఈఎంఐ తో కొనుగోలు చేస్తే రూ.3,500 ఫ్లాట్ తగ్గింపు వస్తుంది. అలాగే ICICI, axis బ్యాంకుల క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 నుంచి రూ.3,500 వరకు తగ్గింపు తో వస్తుంది. ఇదే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. పాత మొబైల్ ను తీసుకువస్తే రూ.10,000 నుంచి రూ.12,000 వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇలా దాదాపు రూ.43,900 వరకు కొనుగోలు చేయవచ్చు. అయితే వీటికి తోడు మరిన్ని డిస్కౌంట్ సదుపాయాలు ఉండడంతో దాదాపు రూ.40,000 లోపు దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉందని విజయ్ సేల్స్ ప్రతినిధులు తెలుపుతున్నారు.
Also Read: Vivo V 70 మొబైల్ పై మహా క్రేజ్.. ఈ ఫీచర్లు ఉండడంతోనేనా…?
అయితే ఐఫోన్ 15 సిరీస్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్లో 6.1 అంగుళాల XDR OLED డిస్ప్లే కలిగి ఉంది. సూపర్ రెటీనా డిస్ప్లే కావడంతో మూవీస్ చూసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో A 16 ప్రాసెసర్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి కూడా సపోర్ట్ గా నిలుస్తుంది. ఈ మొబైల్లో కెమెరా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవచ్చు.48Mp మెయిన్ కెమెరా ఉండగానే ఉంది.12 Mp అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేస్తుంది.12 MP ఫ్రంటు కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా ఇది అనుగుణంగా ఉంటుంది అలాగే ఫోర్ కె వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
ఐఫోన్ 15 సిరీస్లో చెప్పుకోవాల్సిన మరో విశేషం ఏంటంటే ఇందులో రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉండనుంది. ఇది 15 W వరకు వైర్లెస్ చార్జింగ్ తో పని చేస్తుంది. 30 నిమిషాల్లో 50% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రోజువారి వినియోగదారులతోపాటు నేటితరం యూత్ ఐఫోన్ కొనాలని అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.