Arya 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కెరీర్ లో ‘ఆర్య 2′(Aarya 2 Re Release) చిత్రం ఎంతో ప్రత్యేకం. సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో తెలంగాణ ఉద్యమం కారణంగా యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, పాటలు మాత్రం ఒక పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతీ పాట కూడా చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. ఈ సినిమా ద్వారానే అల్లు అర్జున్ డ్యాన్స్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎన్నో అద్భుతమైన, కఠినతరమైన స్టెప్పులు అల్లు అర్జున్ ఇందులో వేసాడు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే చూడాలని చాలా మంది కోరుకున్నారు. అభిమానుల కోరికను మన్నించి, ఈ చిత్రాన్ని రేపు ఇండియా వైడ్ గా గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలు అయ్యాయి.
Also Read : నైజాంలో అదుర్స్..ఆంధ్రలో బెదుర్స్..’ఆర్య 2′ రీ రిలీజ్ బుకింగ్స్ పరిస్థితి!
బుకింగ్స్ ట్రెండ్ ఆరంభం లో చాలా వేగంగా ఉన్నింది. కానీ ఆ తర్వాత మాత్రం భారీగా డ్రాప్ అయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో పర్వాలేదు అనే రేంజ్ లో బుకింగ్స్ జరిగినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదు. తక్కువ షోస్ షెడ్యూల్ చేసినప్పటికీ కూడా కేవలం 33 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసుకుంది. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ‘సలార్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలకంటే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా చాలా తక్కువ గ్రాస్ నమోదు అయ్యింది. సలార్ చిత్రానికి విడుదలకు ముందు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే. ఆర్య 2 చిత్రానికి కేవలం కోటి 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రేపు కౌంటర్ టికెట్స్ గ్రాస్ ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
రీ రిలీజ్ చిత్రాలలో కచ్చితంగా ఆల్ టైం రికార్డు సాదిస్తుందని అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కనీసం ఇప్పుడు టాప్ 10 లోకి అయినా అడుగుపెడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాకు సరిపడా ప్రొమోషన్స్ చేయకపోవడం వల్లే, ఈ చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుందని కేవలం వారం రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. అదేదో ముందుగానే ప్రకటించి ఉంటే భారీ ప్రొమోషన్స్ చేసి, ఈ సినిమాకు ఆల్ టైం రికార్డుని నెలకొల్పే వాళ్లమని అంటున్నారు. ఒకవేళ ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ పడినా, లాంగ్ రన్ లో ఈ చిత్రం కుమ్మేసే అవకాశాలు ఉన్నాయని, కచ్చితంగా ఈ చిత్రంలోని పాటలు మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాయని అంటున్నారు.
Also Read : 2 నిమిషాల్లో హౌస్ ఫుల్..రీ రిలీజ్ లో ‘ఆర్య 2’ సెన్సేషనల్ రికార్డు!