US India Tariffs
US India Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.(Donald Trump). ప్రతీకార టారిఫ్‌ల వడ్డింపునకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామని ఇదివరకే ప్రకటించారు. అయితే భారత్‌తో ఎలా ఉంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ, భారత్‌తోపాటు సహ వాణిజ్యదేశాలన్నింటిపై ప్రతీకార సుంకాల విషయంలో మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
Also Read: అంతరిక్షం నుంచి భారత్ ఎలా ఉంటుందో తెలుసా.. సునీతా విలియమ్స్ అనుభవం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో సహా కీలక వాణిజ్య భాగస్వామి దేశాలపై ప్రతీకార సుంకాలు(Tariff) విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 2, 2025న ప్రకటించనున్నారు. ఈ సుంకాల విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ఈ విషయంపై మాట్లాడుతూ, భారత్ అమెరికా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు వసూలు చేస్తోందని, ఇతర దేశాలు కూడా అధిక సుంకాలతో అమెరికా ఎగుమతులను అసాధ్యం చేస్తున్నాయని వివరించారు.
జాబితా ప్రకటన..
కరోలిన్ లీవిట్(Carolin leevit) మీడియాకు అధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను వెల్లడించారు. ‘కొన్ని దేశాలు చాలా కాలంగా అమెరికాపై అన్యాయమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నాయి. ఐరోపా సమాఖ్య అమెరికా డెయిరీ ఉత్పత్తుల(America Dairy Products)పై 50 శాతం, జపాన్ బియ్యంపై 700 శాతం, భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం, కెనడా బటర్, చీజ్‌పై 300 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. దీంతో అమెరికా ఉత్పత్తులను ఆ మార్కెట్లకు ఎగుమతి చేయడం కష్టమవుతోంది. ఇది అమెరికన్ వ్యాపారాలకు నష్టం కలిగిస్తోంది. అందుకే ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయం‘ అని ఆమె తెలిపారు.
అమెరికాకు గేమ్ ఛేంజర్ లాంటిది..
ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో శాశ్వత నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది అమెరికాకు గేమ్ ఛేంజర్(Game Changer) లాంటిది. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించాం, కానీ అవి అమెరికాను దోచుకున్నాయి. కొన్నిసార్లు మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి. దశాబ్దాలుగా వారు విధించిన సుంకాలతో పోలిస్తే, అమెరికా విధించే సుంకాలు చాలా తక్కువ‘ అని అన్నారు. ఈ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైనా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
బంధాల్లో చారిత్రక మార్పు..
కరోలిన్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం వాణిజ్య సంబంధాల్లో చరిత్రాత్మక మార్పును తీసుకువస్తుందని, అమెరికా ప్రజల క్షేమం కోసం ఈ కీలక నిర్ణయాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయం అమెరికా వాణిజ్య విధానాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది, అయితే దీని ప్రభావం భారత్ వంటి దేశాల ఎగుమతులపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.